In Pics: అనాథలకు గుర్తింపుపై కేబినేట్ సబ్ కమిటీ భేటీ... పాల్గొన్న మంత్రి కేటీఆర్
అనాథలపై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలో మంత్రుల కమిటీ సమావేశం
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్
సమావేశానికి వస్తున్న మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్
రాష్ట్రంలో అనాథలు అనేవారు ఇక ఉండొద్దనే గొప్ప సంకల్పంతో వారిని రాష్ట్ర బిడ్డలుగా పరిగణిస్తూ, వారికి కేజీ నుంచి పీజీ వరకు ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ పెట్టి ప్రత్యేక గురుకులాల్లో నాణ్యమైన విద్య అందించి, జీవితంలో స్థిరపడేలా ఉపాధి కల్పించాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది.
మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ప్రత్యేక ఆహ్వానితులుగా బోయినపల్లి వినోద్ కుమార్ సభ్యులుగా ఉన్న కేబినెట్ సబ్ కమిటీ నేడు హైదరాబాద్ లోని, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ లో సమావేశమై చర్చించింది.
హైదరాబాద్ లోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ లో పరిసరాలను పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్
బాలికలతో ముచ్చటిస్తున్న మంత్రి కేటీఆర్
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ లో బాలికలతో మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్ గ్రూప్ ఫొటో