Hyderabad 37th National Book Fair: హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ పుస్తక ప్రదర్శన చూసొద్దాం రండి
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో 37 వ జాతీయ పుస్తక ప్రదర్శన వైభవంగా ప్రారంభమైంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ పుస్తక ప్రదర్శన డిసెంబర్ 19 నుంచి 29 వరకు 11 రోజులపాటు జరుగుతుంది.
ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శకులకు ప్రవేశం ఉంటుంది.
ఏడాదికి ఒకసారి వచ్చే జాతీయ పుస్తకాల ప్రదర్శన పుస్తక ప్రియులకు పండుగలా మారింది.
సాహిత్య ప్రాముఖ్యతను పెంచడం, పాఠకులను ఆకర్షించడం, కొత్త రచయితలకు గుర్తింపు కల్పించడమే లక్ష్యంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభమైంది.
తొలుత అశోక్ నగర్లోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో ప్రారంభమైన ఈ ప్రదర్శన, ఇప్పుడు సాహిత్య ప్రేమికుల జీవితాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.
ఈసారి ప్రదర్శనలో 350 స్టాళ్లను ఏర్పాటు చేశారు.
వీటిలో 171 స్టాళ్లు తెలుగు పుస్తకాలకు, 135 స్టాళ్లు ఆంగ్ల పుస్తకాలకు, 17 ప్రభుత్వ ప్రచురణలకు, 7 రచయితల ప్రత్యేక స్టాళ్లకు కేటాయించారు.
తెలుగు, ఆంగ్లం, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషలలో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
నవలలు, చిన్న కథలు, కవిత్వం, గ్రాఫిక్ నవలలు, ఆత్మకథలు, పిల్లల కథలు ఇలా అన్ని వయస్సుల వారికి తగిన పుస్తకాలను అందించారు.
- తక్కువ ధరల ఆఫర్లు: అన్ని పుస్తకాలకు కనీసం 10% రాయితీ అందిస్తున్నారు.
రాయితీ ఇవ్వడం పుస్తక ప్రియులను మరింత ఆకర్షిస్తోంది.
- సంస్కృతీ కార్యక్రమాలు: ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు చిన్నారుల కోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ చుట్టుపక్కల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ పుస్తక ప్రదర్శనకు పాఠకులు విచ్చేస్తున్నారు.
ముఖ్యంగా తెలంగాణలో ఉన్న వివిధ జిల్లాల నుంచి ప్రజలు వస్తున్నారు.
ప్రదర్శన ప్రారంభ వేడుకలో పెద్ద సంఖ్యలో పాఠకులు, సాహితీ వేత్తలు, కళాకారులు,రచయితలు హాజరయ్యారు.
“పుస్తక ప్రదర్శనలు సాహిత్యానికి కొత్త ఊపిరి పోసే వేదిక. ఇది పాఠకులను, రచయితలను ఒకే వేదికపైకి తీసుకురావడమే కాకుండా, చిన్న చిన్న వ్యాపారాలకు మద్దతుగా నిలుస్తోంది
బుక్ ఫెయిర్ ను సందర్శించే పుస్తక ప్రియులు తమ కుటుంబ సభ్యులతో కలిసి కొత్త రచనలు, అరుదైన పుస్తకాలను కొనుగోలు చేస్తూ సాహిత్యాన్ని ఆస్వాదిస్తున్నారు.