Brahmamudi Serial Today December 21 Highlights : ఇట్స్ మై ఆర్డర్ అంటూ ఇచ్చిపడేసిన కావ్య.. మురిసిపోయిన రాజ్, అపర్ణ - బ్రహ్మముడి డిసెంబరు 21 ఎపిసోడ్ హైలెట్స్!
నీకో విషయం చెప్పాలని రాజ్ అంటే..ఏం చెప్పినా వింటాను అంటుంది కావ్య. తనపై ప్రేమను వ్యక్తం చేస్తాడేమో అని కావ్య అనుకుంటే వందకోట్ల సంతకం, ఆస్తుల వేలం గురించి చెప్పి షాక్ ఇస్తాడు రాజ్. ఓ పెద్ద సమస్యలో ఉన్నానంటూ మొత్తం చెప్పేస్తాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇంత సమస్యను గుండెల్లో పెట్టుకుని కుమిలిపోతున్నారా...ఇప్పటివరకూ నాకెందుకు చెప్పలేదు అంటుంది. ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదని ఆగిపోయాను నీకు తోచిన పరిష్కారం చెప్పవా అని అడుగుతాడు. రేపు ఉదయం మీతోపాటు ఆఫీస్ కి వస్తానంటుంది కావ్య. కావ్యను హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు
మర్నాడు ఉదయం కావ్య రాజ్ ఆఫీసుకి బయలుదేరుతారు. ఇంటి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మీ బ్యాగులో పెట్టుకోండి అంటుంది. ఎందుకు .. బ్యాంకువాళ్లు ఎదురుతిరిగితే ఈ ప్రాపర్టీ తాతయ్యదికాదు నాది అంటావా అంటాడు..నన్ను అర్థం చేసుకున్నది ఇదేనా అంటుంది కావ్య. సారీ అంటాడు రాజ్.
రాజ్, కావ్య కలిసి రావడం చూసిన అపర్ణ, సుభాష్ షాక్ అవుతారు..కలసి వచ్చినంతమాత్రాన కలిసిపోయినట్టు కాదంటుంది ధాన్యం. ఇద్దరం ఆఫీసుకి వెళుతున్నాం అంటే నువ్వెందుకు అంటుంది ధాన్యం. కొన్ని డిజైన్లు వేయాలి అవి నేనే వేయాలి అందుకే తీసుకెళ్తున్నారు అంటుంది కావ్య .
స్వప్న వచ్చి ఇద్దరూ కలసి వెళుతుంటే నేను హ్యాపీ అంటుంది. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఆలస్యం అయిపోతుంది అందుకే.. ఈ కీస్ నీ దగ్గర ఉంచు అంటుంది. ఇద్దరూ ఆఫీసుకి వెళ్లడం ఏంటి..ఆ కీస్ ఏంటని రుద్రాణి అంటే ఇంటి పెత్తనం నాకు అప్పగించింది అంటుంది స్వప్న.
కనకానికి కాల్ చేసిన అపర్ణ.. ఇద్దరూ కలసిపోయారని చెప్పగానే కనకం-కృష్ణమూర్తి సంతోషిస్తారు.
ఆఫీసుకు వెళ్లిన రాజ్, కావ్య దగ్గరకు బ్యాంక్ వాళ్లు వచ్చి వందకోట్ల మాటేంటని అడుగుతారు...ఒకేసారి కట్టలేం ఇన్ స్టాల్ మెంట్స్ గా కడతామని రిక్వెస్ట్ చేస్తుంది కావ్య..కన్వీన్స్ అయిన బ్యాంకు వాళ్లు సరే అంటారు.
బ్రహ్మముడి డిసెంబర్ 23 సోమవారం ఎపిసోడ్ లో ... డబ్బు అడిగిన రుద్రాణికి తెచ్చి ఇస్తుంది స్వప్న. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన కావ్య.. అక్కా ఆగు తీసుకున్న ప్రతి రూపాయికి బిల్లు చూపించాలి ఇట్స్ మై ఆర్డర్ అని ఇచ్చి పడేస్తుంది