Nikhat Zareen Photos: బాక్సింగ్ రింగ్ లో శివంగి-బయట అల్లరి పిల్ల నిఖత్ జరీన్
తెలంగాణ రాష్ట్రం నిజమాబాద్ కి చెందిన మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది నిఖత్ జరీన్. అమ్మాయిలు ఎందుకు బాక్సింగ్ చేయడం లేదని తండ్రి మహమ్మద్ జమీల్ అహ్మద్ ను ప్రశ్నించిన నిఖత్..పదమూడేళ్ల వయసులో బాక్సింగ్ రింగులో ధైర్యంగా అడుగుపెట్టింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగమ్మాయి నిఖత్. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందడుగేసిన నిఖత్ .. రింగ్‌లో సివంగిలా, ప్రత్యర్థులకు సింహస్వప్నంలా పంచ్‌లతో చెలరేగి సరికొత్త చరిత్ర సృష్టించింది.
2010 జూనియర్ జాతీయ ఛాంపియన్ షిప్లో స్వర్ణంతో వెలిగింది. విశాఖలో సాయ్ శిబిరంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత వెంకటేశ్వర రావు శిక్షణలో మరింత రాటుదేలింది. 2011లో 15 ఏళ్లకే జూనియర్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. సీనియర్ స్థాయిలోనూ మెరిసింది.
2018లో భుజానికి గాయం కావడంతో దాదాపు ఏడాది పాటు ఆటకు దూరంగా ఉంది. దీంతో నిఖత్ గురించి అందరూ మర్చిపోయారు. కానీ పడిలేచిన కెరటంలా ఆమె దూసుకొచ్చింది. అంతర్జాతీయ వేదికలపై సత్తాచాటింది. స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో విజేతగా నిలిచి రెండు సార్లు ఆ పోటీల్లో ఛాంపియన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారత బాక్సర్‌గా రికార్డు నమోదు చేసింది. ఇప్పుడు ఏకంగా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది
నిఖత్ జరీన్(Image credit: Nikhat Zareen/Instagram)
నిఖత్ జరీన్(Image credit: Nikhat Zareen/Instagram)
నిఖత్ జరీన్(Image credit: Nikhat Zareen/Instagram)
నిఖత్ జరీన్(Image credit: Nikhat Zareen/Instagram)