US Open 2022: అందుకే నువ్వు ఆల్‌టైం గ్రేట్ రఫా! ముక్కు పగిలి రక్తం కారుతున్నా ఆడిన నాదల్!
ఆల్‌టైం టెన్నిస్ గ్రేట్ రఫెల్ నాదల్ మరోసారి తన పోరాట పటిమను చూపించాడు. ముక్కు పగిలి రక్తం కారుతున్నా యూఎస్ ఓపెన్ ఆడాడు. నొప్పితో విలవిల్లాడుతున్నా, బాధను దిగమింగి ప్రత్యర్థిని ఓడించి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appస్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ గురువారం పురుషుల సింగిల్స్‌లో ఇటలీ ఆటగాడు ఫాబియో ఫాగ్నిని ఎదుర్కొన్నాడు. 2-6, 6-4, 6-2, 6-1 తేడాతో ఓడించి మూడో రౌండుకు దూసుకెళ్లాడు.
ఈ మ్యాచ్ గెలిచేందుకు నాదల్ ఎంతో కష్టపడాల్సి వచ్చింది. కారణం! తన రాకెట్ తన ముక్కుకే తగిలి రక్తస్రావం అయింది. గాయం కావడంతో అతడు నొప్పితో మైదానంలో విలవిల్లాడాడు. వైద్య సిబ్బంది వచ్చి బ్యాండేడ్ వేసిన తర్వాత ఆట కొనసాగించాడు.
నాలుగో సెట్లో 3-0తో ఆధిక్యంలో ఉన్నప్పుడు నాదల్కు గాయమైంది. ప్రత్యర్థి కొట్టిన బంతికి బదులిచ్చే క్రమంలో అతడు వేగంగా పరుగెత్తాడు. అప్పుడే రాకెట్ అతడి ముఖానికి తగిలింది. వెంటనే అతడు పక్కకు వెళ్లి నేలపై పడుకుండిపోయాడు.
నాదల్ తన తర్వాతి పోరులో ఫ్రాన్స్‌కు చెందిన రిచర్డ్ గాస్కెట్‌తో తలపడనున్నాడు. అతడిపై స్పెయిన్ బుల్‌కు 17-0తో తిరుగులేని రికార్డు ఉంది.
గెలిచాక ఫాగ్నినికి ఆల్ ద బెస్ట్ చెబుతున్న నాదల్ (All Images Credit: Twitter)