Tokyo Olympics, Golf: పతకం పై ఆశలు రేపుతోన్న గోల్ఫర్ అదితి అశోక్... 3వ రౌండ్లో 2వ స్థానం
భారత గోల్ఫర్ అదితి అశోక్ పతకం గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ 23 ఏళ్ల గోల్ఫర్ మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో శుక్రవారం మూడో రౌండ్ ముగిసే సమయానికి రెండో స్థానంలో నిలిచి మెడల్ వేటలో కొనసాగుతోంది.
శుక్రవారం 5 బర్డీస్ (1-అండర్ పార్)తో ఆమె రెండో స్థానంలో నిలిచింది. ఆమె కంటే ముందు వరల్డ్ నంబర్ వన్ గోల్ఫర్ నెల్లీ కోర్డా ఉంది. గత మూడు రోజులుగా ఆమె నిలకడగా రాణిస్తోంది.
శనివారం చివరిదైన నాలుగో రౌండ్లో ఇదే నిలకడ కొనసాగిస్తే ఆమె మెడల్ ఖాయం చేసుకుంటుంది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుఝామున 3 గంటలకే ఈ నాలుగో రౌండ్ ప్రారంభమవుతుంది.
ప్రస్తుతం టోక్యో వాతావరణం మారుతోంది. కొన్ని చోట్ల విపరీతంగా ఎండ కాస్తుంటే మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. ఒకవేళ గాలి ఉద్ధృతంగా వీస్తూ.. వర్షం కురిస్తే మూడో రౌండ్ వరకే ఫలితాలను లెక్కలోకి తీసుకుంటారు. అలా జరిగితే అదితికి రజత పతకం వచ్చినట్టే.
గోల్ఫ్‌లో ఎవరికి తక్కువ స్కోరుంటే వారే విజేతగా నిలుస్తారు. ప్రస్తుతం అమెరికా అమ్మాయి కొర్దా నెల్లీ 198 పాయింట్లతో తొలి స్థానంలో ఉంది.
అదితి 201 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తొలిరౌండ్లో 67, రెండో రౌండ్లో 66, మూడో రౌండ్లో 68 పాయింట్లు సాధించింది. ఇక మూడో స్థానానికి ఉమ్మడిగా 203 పాయింట్లతో నలుగురు పోటీ పడుతున్నారు.