Tokyo Olympics 2021: ఒలింపిక్స్లో ‘సూపర్ మామ్స్’
Tokyo Olympics - 2020లో తల్లులు పాల్గొంటున్నారు. తమకు జీవితాన్ని ఇచ్చిన ఆటలో పతకం గెలిచి దేశానికే ఆదర్శంగా నిలవాలనుకుంటున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇందుకోసం టోర్నీల్లో పాల్గొంటూ ఏకంగా ప్రపంచంలోనే అత్యున్నత క్రీడా సంగ్రామమైన ఒలింపిక్స్కి అర్హత సాధించారు. వీరిలో భారత్కు చెందిన సానియా మీర్జా, మేరీ కోమ్ కూడా ఉన్నారు. ఇంకా ఎవరెవరు తల్లులు ఈ సమ్మర్ ఒలింపిక్స్ లో పాల్గొన్నారో చూద్దాం.
Sania Mirza: భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా నాలుగో సారి ఒలింపిక్స్లో పాల్గొంది. 2018లో మగబిడ్డకు జన్మనిచ్చిన సానియా రెండేళ్లుకు పైగా ఆటకు దూరమైంది. తిరిగి 2020లో కోర్టులో అడుగుపెట్టింది.
నలుగురు పిల్లలకు అమ్మగా టోక్యోలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది బాక్సర్ మేరీకోమ్. 2007లో మగ కవలలకు జన్మనిచ్చింది. 2013లో మరోసారి మగ బిడ్డను కన్నది. 2018లో మేరీ దంపతులు ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఇలా ఇప్పుడు నలుగురు పిల్లల తల్లిగా 38 ఏళ్ల వయసులో టోక్యో క్రీడల్లో పతకమే లక్ష్యంగా బరిలో దిగనుంది.
కెనడా బాస్కెట్బాల్ క్రీడాకారిణి కిమ్ గౌచర్. ఈమెకి మూడు నెలల పాప.
అమెరికాకు చెందిన ఫెన్సింగ్ క్రీడాకారిణి. ఈమెకి నెలల వయస్సున
అమెరికా మారథాన్ రన్నర్ అలిఫిన్ ఈ ఏడాది జనవరిలోనే బిడ్డకి జన్మనిచ్చింది.
అమెరికాకు చెందిన అలీసన్ ఫెలిక్స్ ఇప్పటికే నాలుగు ఒలింపిక్స్లో ప్రాతినిథ్యం వహించి తొమ్మిది పతకాలను గెలిచింది. ఇప్పుడు రెండేళ్ల పాపతో టోక్యో ఒలింపిక్స్కి వెళ్లింది.
ఉజ్బెకిస్థాన్ జిమ్నాస్ట్ ఒక్సానాకు 46 ఏళ్లు. 6 ఏళ్ల వయసులో ఒక్సానా రికార్డు స్థాయిలో ఎనిమిదో ఒలింపిక్స్లో పోటీపడుతోంది.