Tollywood Actress Pets Photos: వాటి ప్రేమలో మునిగిపోయిన మన హీరోయిన్లు!
టాలీవుడ్ లో చాలా మంది జంతుప్రేమికులు ఉన్నారు. లాక్ డౌన్ సమయంలో కూడా కొందరు తారలు మూగజీవాలకు సాయం చేశారు. మన హీరోయిన్స్ లో చాలా మందికి పెంపుడు జంతువులు ఉన్నాయి. వాటిని ఫ్యామిలీ మెంబర్ లానే ట్రీట్ చేస్తుంటారు. తమ పెట్స్ తో ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అంతగా మూగజీవాలను ప్రేమించే మన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం!
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశృతి హాసన్ : ఈ బ్యూటీ చాలా కాలంలో పిల్లులను పెంచుకుంటోంది. వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది.
పూజాహెగ్డే : ఈ బుట్టబొమ్మ దగ్గర గోల్డెన్ రెట్రీవర్ జాతికి చెందిన డాగ్ ఉంది. దీని పేరు బ్రూనో. పూజాకి సమయం దొరికినప్పుడల్లా తన డాగ్ తో సమయం గడుపుతుంటుంది.
తమన్నా : మన మిల్కీ బ్యూటీ ఇంగ్లాండ్ కు చెందిన యార్క్ షైర్ టెర్రియర్ (Yorkshire Terrier) అనే డాగ్ ను అడాప్ట్ చేసుకుంది. దీనికి పెబల్స్ అని పేరు పెట్టుకొని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఎప్పటికప్పుడు తన పెబల్స్ తో ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
కీర్తి సురేష్ : ఈ బ్యూటీ టిబెట్ కి చెందిన షిజ్జు అనే బ్రీడ్ డాగ్ ను పెంచుకుంటుంది. దీనికి నైక్ అనే పేరు పెట్టుకుంది. దీంతో పాటు ఆమె దగ్గర లాబ్రడార్ జాతికి చెందిన మరో డాగ్ కూడా ఉంది.
అనుపమ పరమేశ్వరన్ : అనుపమ తనకు విస్కీ అంటే పిచ్చి అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. విస్కీ అంటే తన పెంపుడు కుక్క. దీంతో పాటు ఆమె పిల్లులను కూడా పెంచుతుంటుంది.
రష్మిక : రీసెంట్ గా ఈ బ్యూటీ ఓ డాగ్ ను అడాప్ట్ చేసుకుంది. దీనికి ఆరా అనే పేరు కూడా పెట్టింది. తను ఎక్కడకి వెళ్లినా.. ఆరాను వెంటబెట్టుకొనే వెళ్తుంది రష్మిక. ఆరా తన లైఫ్ లోకి వచ్చిన తరువాత చాలా మార్పులు వచ్చాయని రష్మిక చెబుతుంటుంది.
సమంత : అక్కినేని వారి కోడలు సమంత చాలా కాలంగా ఫ్రెంచ్ బుల్ డాగ్ ను పెంచుకుంటుంది. దాని పేరు హ్యాష్. దీన్ని సమంత ఎంతో ప్రేమగా పెంచుకుంటుంది. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. ఈ లాక్ డౌన్ సమయంలో హ్యాష్ తో ఎక్కువ సమయం గడపగలిగానని సమంత ఓ సందర్భంలో చెప్పింది.
అనుష్క : దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క కూడా ఒక డాగ్ ను పెంచుకుంటుంది. అప్పుడప్పుడు తన పెట్ తో తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తుంటుంది.