17 Years of Sunil Chhetri: సలామ్ ఛెత్రీ! ఫుట్‌బాలర్‌గా 17 ఏళ్లు - మెస్సీ, రొనాల్డొతో పోటీగా గోల్స్!
టీమ్ఇండియా ఫుట్‌బాల్ కెప్టెన్ సునిల్ ఛెత్రీ 17 ఏళ్ల క్రితం ఇదే రోజు (జూన్ 12)న అరంగేట్రం చేశాడు. అప్పట్నుంచి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏఐఎఫ్ఎఫ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సునిల్ ఛెత్రీ ఏకంగా ఆరుసార్లు గెలిచాడు. అతడిని మించిన ఫుట్‌బాలర్ దేశంలోనే మరొకరు లేరు.
మూడు వేర్వేరు ఖండాల్లోని క్లబ్‌లకు ఆడుతున్న ఏకైక భారతీయుడు సునిల్ ఛెత్రీ. అమెరికాలో మేజర్ లీగ్, ఐరోపాలో స్పోర్టింగ్ లిస్బన్, ఆసియాలో ఇండియన్ క్లబ్స్‌కు ఆడుతున్నాడు.
ఛెత్రీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో మూడుసార్లు హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. 2008లో తజికిస్థాన్, 2010లో వియత్నాం, 2018లో చైనీస్ తైపీపై సాధించాడు. ఇండియన్ సూపర్ లీగ్‌లోనూ రెండుసార్లు చేయడం ప్రత్యేకం.
టీమ్ఇండియా తరఫున అత్యధిక మ్యాచులు ఆడిన ఫుట్‌బాలర్ సునిల్ ఛెత్రీ. 128 మ్యాచుల్లో ఆడాడు. 83 గోల్స్ చేశాడు. సునిల్ ఛెత్రీకి 2021, నవంబర్ 13న మేజర్ ధ్యాన్‌చంద్ అవార్డును అందుకున్నాడు.
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో క్రిస్టియన్ రొనాల్డొ (117), లయనల్ మెస్సీ (86) తర్వాత ఎక్కువ గోల్స్ చేసింది సునిల్ ఛెత్రీయే. 83 చేశాడు.