Chess Olympiad Winners: చెస్ ఛాంపియన్లతో ప్రధాని మోదీ, చారిత్రాత్మక విజయం అంటూ మరోసారి ప్రశంసలు

బుడాపెస్ట్‌లో జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్‌లో భారత యువ చెస్ క్రీడాకారులు అద్భుతం చేశారు. చెస్ ఒలింపియాడ్ లో విజేతగా నిలిచిన భారత్ స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
టోర్నమెంట్ అనంతరం స్వదేశానికి చేరుకున్న ఆటగాళ్ళు బుధవారం ప్రధాని మోదీని తన నివాసంలో కలుసుకున్నారు.

అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిలు కూడా బంగారు పతకాలను సాధించడం, భారత్‌ను గర్వపడేలా చేయడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు ప్రధాని మోదీ.
ఛాంపియన్లతో ప్రధాని మోదీ కాసేపు మాట్లాడారు. ఎలాగైనా స్వర్ణంతో వస్తామని చెప్పినట్టుగానే భారత పురుషులు, మహిళల జట్లు స్వర్ణం తో తిరిగి వచ్చారని , భారత క్రీడా రంగంలో బంగారు అధ్యాయం మొదలయ్యిందని మోదీ అన్నారు.
జాన్ సుబెల్జ్‌పై ఇరిగేశీ నెగ్గగా, వ్లాదిమిర్ ఫెదోసీవ్పై గుకేశ్ విజయం సాధించాడు. దాంతో చెస్ ఒలింపియాడ్ లో భారత్ తొలిసారి స్వర్ణం కైవసం చేసుకుంది.
అమ్మాయిలలో దివ్య దేశ్‌ముఖ్, హారికలు ప్రత్యర్థుల్ని చిత్తు చేయగా.. ప్రజ్ఞానంద సోదరి వైశాలి డ్రా చేసుకుంది. వంతిక అగర్వాల్ నెగ్గడంతో భారత మహిళల జట్టు సైతం చెస్ ఒలింపియాడ్ చరిత్రలో తొలిసారి స్వర్ణం కైవసం చేసుకుంది.