పీరియడ్స్ ఇర్రెగ్యూలర్గా వస్తున్నాయా? అయితే ఈ ఫుడ్స్ తీసుకుంటే మంచిదట
హార్మోన్లలో హెచ్చుతగ్గులు, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటివి క్రమరహిత్య పీరియడ్స్‌కు దారితీస్తాయి. ఒత్తిడి, ఫుడ్, వ్యాయామం ఇలాంటి పలు అంశాలు కూడా పీరియడ్స్‌ను డిస్టర్బ్ చేస్తాయి. (Images Source : Pinterest)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇలాంటి ఇబ్బందుల వల్ల రుగ్మతలు, గర్భాశయ ఫైబ్రాయిడ్లు, దీర్ఘకాలిక సమస్యలు, పీసీఓఎస్, పీసీఓడీ సమస్యలు ప్రతి అమ్మాయిని ఇబ్బంది పెడతాయి. (Images Source : Pinterest)
అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు ఋతుచక్రాలను నియంత్రిస్తాయి. అంతేకాకుండా నొప్పిని తగ్గిస్తాయి. 2014 క్లినికల్ స్టడీ ప్రకారం.. ఇది 92మంది మహిళల్లో పీరియడ్స్ సమయంలో బ్లీడ్ని కంట్రోల్ చేస్తుందని తేలింది. (Images Source : Pinterest)
దాల్చినచెక్క కూడా పీరియడ్స్ సమస్యను క్లియర్ చేస్తుంది. పీసీఓఎస్ సమస్యతో ఇబ్బంది పడేవారు దీనిని తీసుకుంటూ ఉంటే సమస్య కంట్రోల్ అవుతుందని అమెరికన్ జర్నల్ తేల్చింది. ఇది మెరుగైన రక్తప్రసరణను అందించి నొప్పి నుంచి ఉపశమనం అందిస్తుంది. (Images Source : Pinterest)
యాపిల్ సైడర్ వెనిగర్ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. అలాగే హార్మోన్లను కూడా అదుపులో ఉంచుతుంది. దీనిని నీటిలో డైల్యూట్ చేసి.. తీసుకుంటే పీరియడ్ రెగ్యూలర్‌గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. (Images Source : Pinterest)
జీలకర్ర నీటిని రెగ్యూలర్‌గా తీసుకుంటే ఎసెన్సిషియల్ ఆయిల్స్, న్యూట్రెంట్స్ శరీరానికి అందుతాయి. ఇవి హార్మోన్లను అదుపులో ఉంచి మెరుగైన జీర్ణక్రియను అందిస్తాయి. ఉదయాన్నే పరగడున జీలకర్ర తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.(Images Source : Pinterest)
బొప్పాయి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. అలాగే పచ్చిబొప్పాయి కూడా పీరియడ్స్ సమస్యలను తగ్గిస్తుంది. పీరియడ్ నొప్పిని తగ్గించి.. రెగ్యూలర్‌గా వచ్చేలా హార్మోన్స్‌పై ప్రభావం చూపిస్తుంది. (Images Source : Pinterest)
పైనాపిల్లోని ఎంజైమ్స్ పీరియడ్ నొప్పిని తగ్గిస్తాయి. అలాగే ఇది పీరియడ్ సైకిల్ని కూడా రెగ్యూలర్ చేస్తుంది. కాబట్టి పైనాపిల్‌ని తిన్నా.. జ్యూస్‌గా తీసుకున్నా పీరియడ్ హెల్త్ మంచిగా ఉంటుంది. (Images Source : Pinterest)
పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పీరియడ్ నొప్పిని తగ్గిస్తాయి. హార్మోన్లను అదుపులో ఉంచుతాయి. అలాగే పీరియడ్ సమస్యలను కూడా దూరం చేసి.. హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. (Images Source : Pinterest)