Paris Olympics 2024 Closing Ceremony: అంబారాన్నంటిన విశ్వ క్రీడా ముగింపు సంబరాలు
ముగింపు వేడుకల్లో భారత అథ్లెట్లు మెరిశారు. రెండు ఒలింపిక్స్ పతకాలతో చరిత్ర సృష్టించిన మను బాకర్ త్రివర్ణ పతకాన్ని చేతబూని నడపగా... ఈ ఒలింపిక్స్‌తో తన కెరీర్‌కు వీడ్కోలు పలికిన శ్రీజేష్ పక్కనే నడిచాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమిగిలిన భారత బృందం వారిని అనుసరించింది. ఈ భావోద్వేగ క్షణాలను క్రీడా ప్రపంచం సంభ్రమాశ్చర్యాలతో చూసింది.
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగాయి. ఫ్రాన్స్‌లోని స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియంలో జరిగిన ముగింపు వేడుక అదిరిపోయింది.
లాస్ఏంజెలెస్ వేదికగా 2028 ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పారిస్ ముగింపు వేడుకల్లో ఐవోసీ ప్రెసిడెంట్ థామస్ ఒలింపిక్ పతకాన్ని లాస్ఏంజెలెస్ మేయర్ కారెన్‌కు అందించారు.
పారిస్ ఒలింపిక్స్‌లో 32 క్రీడాంశాల్లో 329 స్వర్ణ పతకాలకు 206 దేశాలకు చెందిన 10,714 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. అగ్రరాజ్యం అమెరికా 40 స్వర్ణాలతో టాప్‌లో నిలిచింది.
ఈ వేడుక కోసం స్టేడియంను థియేటర్‌గా మార్చారు. ఈ వేడుకలో కళాకారుల ప్రదర్శన మతిపోగొట్టింది.
ప్రపంచంలో అత్యున్నత క్రీడలుగా భావించే ఒలింపిక్స్ ముగింపు వేడుకలు ఆదివారం అర్ధరాత్రి ఘనంగా ముగిశాయి. జులై 26న విశ్వ క్రీడలు ప్రారంభం కాగా.. ఆగష్టు 11న క్లోజ్ అయ్యాయి.
ఎన్నో సంచలనాలు, మరెన్నో అబ్బురపరిచే ప్రదర్శనలు, కొత్తగా నమోదైన రికార్డులు, త్రుటిలో చేజారిన పతకాలకు ఈ ఒలింపిక్స్ సాక్ష్యంగా నిలచింది.