Paris Olympics 2024: చరిత్ర సృష్టించిన మను భాకర్
ఎన్నో ఏళ్ళ నిరీక్షణ తరువాత యువ షూటర్ మను భాకర్ ప్రపంచ క్రీడా వేదికపైనా సత్తా చాటింది. ఒలింపిక్స్ 10మీ ఎయిర్ పిస్టల్ ఫైనల్లో మను భాకర్ 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App12 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించుతూ.. కాంస్యాన్ని కైవసం చేసుకుంది.
టీనేజీలోనే సంచలన ప్రదర్శనతో ప్రపంచ మేటి షూటర్లలో ఒకరుగా ఎదిగిన యువ క్రీడాకారిణి మను భాకర్.
పలు క్రీడలల్లో ప్రవేశం ఉన్నా షూటింగ్‌పైనే దృష్టి సారించిన మను, అది సరైన నిర్ణయమే అని అతి కొద్ది రోజులకే తెలుసుకుంది.
హరియాణాకు చెందిన మను, స్కూల్ లో ఉన్నప్పుడు టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్‌లో రాణించింది. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం పొందింది. అన్ని విభాగాల్లోనూ పతకాలు సాధించింది.
2017లో కేరళలో నిర్వహించిన జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా తొమ్మిది స్వర్ణాలు సాధించింది.
2018 మెక్సికోలో అంతర్జాతీయ స్పోర్ట్ షూటింగ్ ఫెడరేషన్ ప్రపంచ కప్‌లో అరంగేట్రం చేసింది. హేమాహేమీలతో తలపడి బంగారు పతకాన్ని గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది.
10మీ ఎయిర్ పిస్టల్‌లో కాంస్య పతకం సాధించిన యువ షూటర్ మను భాకర్‌ను పలువురు ప్రముఖులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
ఒలింపియన్, మాజీ ప్రపంచ నంబర్ 1 హీనా సిద్ధూనూ ఓడించి, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో హీనా నెలకొల్పిన రికార్డును తిరగరాసింది.
2017 ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతంతో తొలిసారి అంతర్జాతీయ పోటీల్లో పతకం అందుకుంది.
ఆస్ట్రేలియాలో జరిగిన 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విబాగంలో స్వర్ణం.
2018 యూత్ ఒలింపిక్స్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయ షూటర్‌గా, భారత్ నుంచి మొదటి మహిళా అథ్లెట్‌గా నిలిచింది.
తన గెలుపులో భగవద్గీత కీలక పాత్ర పోషించిందని విజయం అనంతరం బాకర్ వ్యాఖ్యానించింది. అర్జునుడికి కృష్ణుడు చేసిన హితోపదేశమే తనకు మార్గ నిర్దేశం చేసిందని తెలిపింది.