Malvi Malhotra: 'తిరగబడర సామి' ప్రమోషన్‌లో మాల్వీ మల్హోత్రా, రాజ్ తరుణ్ ఎక్కడా?
Malvi Malhotra Photos: ఈ మధ్య మాల్వీ మల్హోత్రా పేరు బాగా వినిపిస్తుంది. రాజ్ తరుణ్ అతడి ప్రియురాలు లావణ్య కేసులో వివాదంలో మాల్వీ పేరు కూడా వినిపించింది.
మాల్వీతో ఎఫైర్ పెట్టుకుని రాజ్ తరుణ్ తనని వదిలించుకోవాలని చూస్తున్నాడంటూ ఆమె పోలీసులకు ఆరోపించింది. అంతేకాదు ఈ కేసులో రాజ్ తరణ్‌తో పాటు మాల్వీపై కూడా కేసు నమోదైంది.
దీంతో కొద్ది రోజులుగా సైలెంట్ అయినా మాల్వీ తాజాగా సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది. వివాదాల నడుమ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. తిరగబడర సామి ప్రమోషన్స్ భాగంగా ఈ ఫోటోలు షేర్ చేసింది. దీంతో వీటిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
చాలా అందంగా ఉన్నావని, క్యూట్ అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే.. మరికొందరు రాజ్ తరుణ్ పేరుతో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. నీ గుండె రాజ్ తరుణ్ కోసం కొట్టుకుంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.
అంతేకాదు రాజ్ తరుణ్ ఎక్కడ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ వివాదం నేపథ్యంలో ఆమె ఫోటోలు షేర్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.