భారత హాకీలో ముగిసిన శ్రీజేష్ శకం
భారత హాకీ చరిత్రలో ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాగా ఖ్యాతి గడించిన గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ .
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభారత్ గోల్ పోస్ట్ ముందు కంచు కోటను నిర్మించి భారత్‌కు ఎన్నో విజయాలు అందించిన శ్రీజేష్ తన సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.
క్రీడల్లో భారత్‌కు మరో కాంస్య పతకాన్ని అందించి తన కెరీర్‌ను ముగించాడు.
స్పెయిన్‌తో జిరిగిన కాంస్య పతక పోరులో విజయం సాదించగానే మైదానంలో శ్రీజేష్ పూర్తిగా కిందపడుకుని తన హాకీ గేర్‌కు నమస్కరించాడు.
2006లో భారత్ హాకీ జట్టులోకి అరంగేట్రం చేసిన శ్రీజేష్... 2020 టోక్యో ఒలింపిక్స్‌లో జట్టు కాంస్య పతక విజయంలో కీలకపాత్ర పోషించాడు.
18 సంవత్సరాల కెరీర్లో చివరి మ్యాచ్‌ను చిరస్మరణీయంగా చేసుకుని వెనుదిరిగాడు.
శ్రీజేష్‌కు ఒలింపిక్స్ కాంస్య పతకంతో భారత హాకీ జట్టు ఘనమైన వీడ్కోలు పలికింది.
శ్రీజేష్ అద్భుత కెరీర్లో భారత గోల్‌పోస్ట్ ముందు కంచు కోటను నిర్మించాడు. క్లిష్టమైన పెనాల్టీ కార్నర్లను ఆపి భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.