T20 Hundreds: మొత్తం 8 టీ20 సెంచరీలు! హుడా నాలుగోవాడు.. మిగతా ముగ్గురు ఎవరంటే?
ఐర్లాండ్‌తో రెండో టీ20లో యువ ఆటగాడు దీపక్ హుడా సెంచరీ కొట్టాడు. 55 బంతుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు. పొట్టి క్రికెట్లో భారత్ తరఫున సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా అవతరించాడు. మరి అతడి కన్నా ముందు అందుకున్నది ఎవరంటే?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీ20 క్రికెట్లో సెంచరీలు చేయడమంటే టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సరదా! ఏకంగా నాలుగుసార్లు కొట్టేశాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరూ అతడిదే. ఇండోర్‌లో శ్రీలంకపై 2017లో 118 కొట్టాడు.
రోహిత్ శర్మ 2018లో లక్నోలో వెస్టిండీస్‌పై 118*, 2015లో ధర్మశాలలో దక్షిణాఫ్రికాపై 106, 2018లో బ్రిస్టల్‌లో ఇంగ్లాండ్‌పై 100* కొట్టాడు.
టీమ్ఇండియా తరఫున టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు కొట్టిన రెండో ఆటగాడు కేఎల్ రాహుల్. 2016 ఆగస్టులో లాడర్‌హిల్‌లో వెస్టిండీస్‌పై 110తో అజేయంగా నిలిచాడు. 2018లో మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌పై 101తో నాటౌట్‌గా నిలిచాడు. ఈ రెండూ విదేశాల్లోనే కావడం గమనార్హం.
టీమ్ఇండియా తరఫున మొట్టమొదట సెంచరీ కొట్టిన ఆటగాడు సురేశ్ రైనా. 2010లో గ్రాస్ ఐస్లెట్లో దక్షిణాఫ్రికాపై 101 పరుగులు చేశాడు.