KL Rahul Lords Test Pics: లార్డ్స్ మైదానంలో కేఎల్ రాహుల్ రికార్డులు మీద రికార్డులు
ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో భారత క్రికెటర్ KL Rahul రికార్డుల మీద రికార్డులు సాధించాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (2021-23) సెకండ్ ఎడిషన్‌లో ఫస్ట్ సెంచరీ నమోదు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రాహుల్ నిలిచాడు.
ఆసియా వెలుపల అత్యధిక టెస్టు సెంచరీలు నమోదు చేసిన రెండో భారత క్రికెటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. సునీల్ గవాస్కర్ 15 సెంచరీలతో టాప్‌లో ఉండగా.. కేఎల్ రాహుల్‌కి ఇది నాలుగో శతకం, వీరేంద్ర సెహ్వాగ్ కూడా నాలుగు శతకాలతో రాహుల్ సరసన ఉన్నాడు. ఆ తర్వాత మూడో స్థానంలో వినో మాన్కడ్, రవిశాస్త్రి మూడేసి శతకాలతో ఉన్నారు.
లార్డ్స్‌లో తొలి వికెట్‌కి టెస్టులో భారత ఓపెనర్లు శతక భాగస్వామ్యం నెలకొల్పడం 1952 తర్వాత ఇదే తొలిసారి. అప్పట్లో పంకజ్ రాయ్- మాన్కడ్ ఈ ఘనత సాధించగా.. తాజాగా రోహిత్ శర్మ- కేఎల్ రాహుల్ 126 పరుగులతో ఆ జోడీ సరసన నిలిచారు.
ఇంగ్లాండ్ తో రెండో టెస్టులో కేఎల్ రాహుల్ 129 (250 బంతుల్లో 12x4, 1x6) పరుగులు చేశాడు.
తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ 84 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.