Hockey World Cup 2023: ఒడిశాలో హాకీ వరల్డ్ కప్ ప్రారంభోత్సవ వేడుకలు, స్పెషల్ అట్రాక్షన్‌గా దిశా పటానీ
బుధవారం సాయంత్రం బారాబతి స్టేడియంలో హాకీ ప్రపంచకప్ ప్రారంభ వేడుక నిర్వహించారు. ఈ టోర్నీలో భారత్ తో సహా 16 దేశాలు పాల్గొనబోతున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజనవరి 13 నుంచి ఒడిశా వేదికగా పురుషుల హాకీ ప్రపంచకప్- 2023 ప్రారంభం కానుంది.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కటక్ లోని బారాబతి స్టేడియంలో పురుషుల ప్రపంచకప్ ప్రారంభ వేడుకను మొదలుపెట్టారు..
మనదేశ సంస్కృతి, ఉత్సవం, క్రీడాస్ఫూర్తి ఆలోచనలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ప్రదర్శన సాగనుంది. దీనికోసం ఒడిశా ప్రభుత్వం అనేక సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేసింది.
ఒడిశా వరుసగా రెండో సారి పురుషుల హాకీ ప్రపంచకప్ నకు ఆతిథ్యం ఇస్తోంది.
బాలీవుడ్ నటి దిశా పటానీ తన అద్భుతమైన స్టెప్పులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచి సెలబ్రేషన్స్‌ని మరో స్థాయికి తీసుకెళ్లింది.
ఈ ప్రారంభ వేడుకలో స్థానిక చలనచిత్ర పరిశ్రమల ప్రముఖులు, బాలీవుడ్ గాయకులు, విదేశాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శనలు
కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, మరియు పలువురు సీనియర్ మంత్రులు, రాష్ట్ర అధికారులు, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్, హాకీ ఇండియా 50,000 మంది సమక్షంలో వేడుకలు జరిగాయి.
భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం, బిర్సా ముండాలో మ్యాచ్‌లు జరగనున్నాయి