PR Sreejesh: సినిమా స్టోరీని తలపించేలా, శ్రీజేష్ క్యూట్ లవ్ స్టోరీ
పీఆర్ శ్రీజేష్.. క్రీడా ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరిది. ఎన్నో మ్యాచుల్లో ప్రత్యర్థులను గోల్ కొట్టనివ్వకుండా భారత్‌కు ఎన్నో విజయాలను అందించాడు శ్రీజేష్.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగోల్ పోస్ట్ కు అడ్డుగా గోడ కట్టే శ్రీజేష్ను.. ఒకమ్మాయి తన చూపులతో పడేసింది. తాను మనసు గోల్ పోస్ట్‌పై అడ్డుగా నిలబడ్డ సునాయసంగా లవ్ గోల్ కొట్టేసింది.
స్కూల్లో చదువుతున్నప్పుడు తనను ద్వేషించిన వ్యక్తినే ప్రేమికుడిగా మార్చుకొని పెళ్ళాడేసింది.
తన ఆసక్తికర లవ్‌స్టోరీని శ్రీజేష్ బయటపెట్టాడు. తన ప్రేమకథ... సినిమా స్టోరీకీ ఏ మాత్రం తక్కువ కాదని కూడా స్టేట్మెంట్ ఇచ్చేశాడు.
స్కూల్ లో శతృత్వం స్నేహంగా మారి , కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ 2013లో కుటుంబసభ్యుల ఆశీర్వాదంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
వృత్తిరీత్యా అనీశ్య ఆయుర్వేద డాక్టర్. భార్య మీద ప్రేమతో తన హాకీ స్టిక్‌పై ఆమె పేరును ప్రత్యేకంగా వేయించుకున్నాడు శ్రీజేష్.
వీరికి ఓ కుమారుడు శ్రీఅన్ష్, కుమార్తె అనుశ్రీ
పారిస్ ఒలింపిక్స్ లో కాంస్యాన్ని అందుకుని తన సుదీర్ఘ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికాడు సీనియర్ గోల్ కీపర్ ఆర్పీ శ్రీజేశ్.
ఒలింపిక్స్ ముగింపు ఉత్సవాలలో మనుబాకర్ తో కలిసి పతాకధారిగా వ్యవహరించాడు. శ్రీజేష్ గౌరవార్థం హాకీ ఇండియా జెర్సీ నంబర్ 16 ను రిటైర్ చేసింది.