FIFA WC Qatar 2022: ఫిఫా స్టేడియాలు చూస్తారా! ప్రతి స్టేడియానికీ ఓ స్పెషాలిటీ!
అల్ బయత్ స్టేడియం: ఫిఫా ఆరంభ మ్యాచ్ జరిగిదే ఇక్కడే. అల్ ఖర్ నగరంలో నిర్మించారు. సెంట్రల్ దోహాకు ఉత్తరాన 35 కి.మీ దూరంలో ఉంటుంది. సీటింగ్ సామర్థ్యం 60వేలు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appలుసెయిల్ స్టేడియం: ఫ్యూచర్ ఐకాన్‌గా దీనిని నిర్మించారు. ఫిఫా ఫైనల్ మ్యాచ్ జరిగిదే ఇక్కడే. సెంట్రల్ దోహాకు 20 కిలోమీటర్ల దూరంలోని లుసెయిల్ సిటీలో నిర్మించారు. 80 వేల మంది ప్రత్యక్షంగా చూడొచ్చు.
స్టేడియం 974: సెంట్రల్ దోహాకు 10 కిలోమీటర్ల దూరంలో రస్ అబు అబౌద్లో నిర్మించారు. ఇదో విచిత్రమైన స్టేడియం. షిప్పింగ్ కంటెయినర్లతో ఈ స్టేడియం కట్టారు. సీటింగ్ సామర్థ్యం 40వేలు.
అల్ తుమామా స్టేడియం: వృత్తాకారంలో వజ్రాలు పొదిగినట్టుగా ఉంటుంది. అల్ తుమామాలో నిర్మించారు. 40వేల మంది కూర్చొని చూడొచ్చు.
అహ్మద్ బిన్ అలీ స్టేడియం: ఎడారిలో నిర్మించిన స్టేడియం ఇది. సెంట్రల్ దోహాకు పశ్చిమ దిశగా 20 కిలోమీటర్ల దూరంలోని ఎమ్ అల్ అఫెయిలో ఉంది. 40వేల మంది పడతారు.
ఎడ్యుకేషన్ సిటీ స్టేడియం: సెంట్రల్ దోహాకు వాయువ్య దిశగా 13 కి.మీ దూరంలో ఉంటుంది. అల్ రియాన్ నగరంలో నిర్మించారు. 40వేల సామర్థ్యం.
ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం: రీ ఇంజినీరింగ్ టెక్నాలజీతో నిర్మించారు. దోహాకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సీటింగ్ సామర్థ్యం 40వేలు.
అల్ జనాబ్ స్టేడియం: అద్భుతమైన నిర్మాణ కళకు ఇదో ప్రతీక. దోహాకు 22 కిలోమీటర్ల దూరంలో అల్ వక్రాలో నిర్మించారు. సీటింగ్ కెపాసిటీ 40వేలు. స్టేడియం పైకప్పు మల్లెపువ్వు ఆకృతిలో ఉంటుంది.