Zaheer Khan: లఖ్‌నవూ మెంటార్ జహీర్ ఖాన్ ప్రేమ కధ తెలుసా మీకు
భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్‌ను ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్ తన మెంటార్‌గా ప్రకటించింది. LSG యజమాని సంజీవ్ గోయెంకా విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ధృవీకరించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీమిండియా మాజీ స్టార్ వ్యక్తిగత జీవితానికి వస్తే ఈ బౌలర్ 2017లో సాగరిక ఘట్గే అనే నటిని వివాహం చేసుకున్నాడు.
జహీర్ ఖాన్, సాగరిక మొదటిసారి స్నేహితుడి పార్టీలో కలుసుకున్నారు. అయితే వారిద్దరూ మీడియాకు చిక్కింది మాత్రం 2016లో యువరాజ్ సింగ్ హేజెల్ కీచ్ వివాహంలోనే.
ఒకసారి వీరు డిన్నర్ డేట్ కు వెళ్ళినప్పుడు జహీర్ సాగరికకు ప్రపోజ్ చేశాడట.
సాగరిక హిందూ కుటుంబం నుండి వచ్చింది. అయితే కొన్ని సంవత్సరాల డేటింగ్ తరువాతే ఆమె జహీర్ ఖాన్ తో వివాహానికి అంగీకరించింది.
జహీర్ ఖాన్, సాగరిక ఘట్గే 2017 లో నిశ్చితార్థం చేసుకున్నారు. అదే సంవత్సరం నవంబర్ నెలలో వివాహం చేసుకున్నారు.
సాగరిక 2020లో తన చివరి చిత్రంలో నటించింది. అయితే జహీర్ కు భార్య నటించడం ఇష్టం లేదని, ఆమెను బాలీవుడ్ నుండి తప్పుకోవాలని ఒత్తిడి తెచ్చాడని చెబుతారు.
అయితే అదంతా నిజం కాదని, జహీర్ తనకు చాలా మద్దతు ఇస్తున్నాడని సాగరిక స్వయంగా ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పింది.