Team India Victory Parade: ఈ సంబరం, అభిమానుల గుండెల్లో పదిలం
అభిమానులు కానిది ఎవరు.. ఢిల్లీ నుంచి ముంబై వస్తున్న విమానంలో టీమిండియా ఆటగాళ్లతో విస్తారా విమాన సిబ్బంది. మీరు అదరగొట్టారు సర్ అని విమాన సిబ్బంది.... మేం సాధించేశామని టీమిండియా క్రికెటర్లు ఫ్లైట్‌లోనే సందడి చేసేశారట మరి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసారధిగా సాధించావోయ్... ముంబైలో నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకూ సాగిన టీమిండియా విజయ్ పరేడ్‌లో రోహిత్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. రోహిత్... రోహిత్ అన్న నినాదాలు ర్యాలీలో మార్మోగాయి. హిట్‌మ్యాన్ కూడా పొట్టి ప్రపంచకప్‌ను అభిమానులకు చూపిస్తూ ఆనందపరిచాడు.
జన సునామీ.. దేశంలో క్రికెట్ ఒక మతమైతే, ఆటగాళ్లే దేవుళ్లు. అలాంటిది సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తమ అభిమాన ఆటగాళ్లు, అభిమాన గణం ఊరుకుంటుందా? స్వదేశంలో కాలుమోపిన క్రికెటర్లకు ఘన స్వాగతం పలికేందుకు అభిమాన కోటి పోటెత్తింది. ఆ జన సునామీని చూసి ముంబై తీరం కూడా చిన్నపోయింది.
మనల్ని ఎవడ్రా ఆపేది.... ఆటలో అయినా డ్యాన్స్‌లో అయినా తమను ఆపే వారు లేరు అనేలా వాంఖడే స్టేడియంలో క్రికెటర్లు సందడి చేశారు. అభిమానులు కోరస్ పాడుతుండగా క్రికెటర్లు డ్యాన్స్‌లతో అదరగొట్టారు. ఆటగాళ్ల డ్యాన్స్‌లు చూసి బాలీవుడ్ నటులు ఆశ్చర్యపోయినా ఆశ్చర్యం లేదేమో.
అల్లరిలోనూ ఆల్‌రౌండర్లే. అక్షర్ పటేల్‌తో కలిసి వాంఖడే స్టేడియంలో అల్లరి చేస్తున్న హార్దిక్ పాండ్యా. భారత్‌కు పొట్టి ప్రపంచకప్‌లో రావడంలో వీరిదే కీలకపాత్ర. ఫైనల్లో వీరిద్దరూ ఆడిన ఆటను అంత తేలిగ్గా మర్చిపోగలమా
బుమ్రా నినదించెన్, ద్రావిడ్ నవ్వెన్. టీ 20 ప్రపంచకప్ గెలవడంలో రాహుల్ ద్రావిడ్, జస్ప్రీత్ బుమ్రాలది చాలా కీలకపాత్ర. బుమ్రా బంతితో... ద్రావిడ్ తన వ్యూహాలతో ప్రత్యర్థులకు చెక్ పెట్టారు. ఎప్పుడూ స్థిమితంగా ఉండే వీరిద్దరూ చేసిన సందడికి వాంఖడే కూడా చిన్నబోయింది. ఈ విజయం ఎంత మధురమో చాటి చెప్పింది.
జీవితకాల జ్ఞాపకాలు... టీ 20 ప్రపంచకప్‌నకు ఈ ఇద్దరు ఆటగాళ్లు వీడ్కోలు పలికినా... చివరి మ్యాచ్‌లో వీరు అభిమానులకు జీవితకాల జ్ఞాపకాలను అందించారు. టీ 20 ప్రపంచకప్ ఫైనల్ నుంచి వాంఖడేలో సన్మానం వరకూ ఈ దిగ్గజ జోడీ చేసిన అల్లరిని, ప్రసంగాలు అభిమానులను భావోద్వేగాలకు గురిచేశాయి.
విజయ గర్జన... టీమిండియా ఆటగాళ్ల విజయ గర్జన. ఎవరు తమన చోకర్స్ అని అవహేళన చేశారో... ఐసీసీ ట్రోఫీలు గెలవలేరని చులకనగా మాట్లాడారో వారందరి చెవులు చిల్లులు పడేలా భారత క్రికెటర్లు చేసిన విజయ గర్జన కొన్నేళ్లపాటు క్రికెట్ ప్రపంచం మర్చిపోలేదు.