MS Dhoni Birthday: రోహిత్ శర్మ కారణంగా 200వ మ్యాచ్‌లో కెప్టెన్సీ చేయగలిగిన ఎంఎస్ ధోని
ఎంఎస్ ధోని మొత్తం 332 అంతర్జాతీయ మ్యాచ్‌లలో కెప్టెన్సీ చేశారు. ఆయన టీమ్ ఇండియా కోసం 60 టెస్ట్, 72 టీ20, 200 వన్డే మ్యాచ్‌లలో కెప్టెన్సీ చేశారు. కానీ 200వ వన్డేలో కెప్టెన్సీ చేసే అవకాశం రోహిత్ శర్మ కారణంగా ఆయనకు లభించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appధోని 60 టెస్ట్ మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించాడు, అందులో జట్టు 27 మ్యాచ్‌లు గెలిచింది. 18 ఓడిపోయింది. 72 టీ20లలో అతను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు, అందులో 42 గెలిచారు, 28 ఓడిపోయారు. ఆ విధంగానే 200 వన్డేలలో కెప్టెన్‌గా వ్యవహరించాడు, 110 గెలిచారు, 74 మ్యాచ్‌లలో ఓడిపోయారు. కానీ రోహిత్ తనను తాను డ్రాప్ చేసుకోకపోతే ధోని 200 వన్డే మ్యాచ్‌లలో కెప్టెన్సీ రికార్డు సాధించలేకపోయేవాడు.
ఎంఎస్ ధోని జనవరి 2017లో వన్డే ఫార్మాట్ నుంచి కెప్టెన్సీ వదిలేశాడు. అప్పటికి కెప్టెన్‌గా అతను 199 వన్డేలు ఆడాడు. 696 రోజుల తర్వాత రోహిత్ శర్మ కారణంగా ధోనికి 200 వన్డేలలో కెప్టెన్సీ చేసే అవకాశం వచ్చింది
2018 ఆసియా కప్ సూపర్ 4 లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో MS ధోని ఒక మ్యాచ్‌కి కెప్టెన్‌గా ఉన్నాడు. ఈవిధంగా రోహిత్ వల్ల ధోని కెప్టెన్ గా 200 వ వన్డే ఆడాడు.
ఎంఎస్ ధోని టీం ఇండియాకు కెప్టెన్‌గా 2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలిపించాడు. అతను భారత్ తరపున 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడాడు, వీటిలో అతను వరుసగా 4876, 10773, 1617 పరుగులు చేశాడు.
ధోని 15 ఆగస్టు 2020న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. అతను ఇప్పుడు కేవలం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో అతని కెప్టెన్సీలో సిఎస్కే 5 టైటిల్స్ గెలుచుకుంది. గత సీజన్లో రుతురాజ్ గాయపడిన తర్వాత అతను మళ్ళీ జట్టు పగ్గాలు చేపట్టాడు