Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ భవంతి చూస్తే మతి పోవాల్సిందే
రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్గా భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కొత్త బాధ్యతలు చేపట్టారు. గౌతం ఢిల్లీ లోని రూ. 20 కోట్ల విలువైన విలాసవంతమైన భవనంలో నివసిస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగంభీర్ తరచుగా తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. అద్భుతమైన ఆ ఇంటిని ఆ ఫోటోలలో చూడచ్చు. గౌతం, అతని భార్య నటాషా జైన్ ఇద్దరు తమ అభిరుచులకు అనుగుణంగా ఇంటిని తీర్చిదిద్దుకునారు.
ఢిల్లీలోని గంభీర్ భవనం చూడటానికి అద్బుతంగాను, ఉండటానికి సౌకర్యంగానూ ఉంటుంది. అలాగే ఇందులో ఫిట్నెస్ కోసం ఒక చక్కని జిమ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు.
గౌతం, నటాషా జైన్ ప్రేమించుకొని, తరువాత పెద్దల అంగీకారంతో 2011లో అత్యంత సన్నిహితుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరికి అజీన్, అనైజా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గంభీర్ తన భార్య, పిల్లలతో ఇంట్లో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతాడు.
గౌతం తన భార్య నటాషా గురించి చాలా ఇంటర్వ్యూల్లో ప్రశంసలు కురిపించాడు. తాను ఒక అద్భుతమైన జీవిత భాగస్వామిని పొందానంటూ కితాబిస్తాడు. ఈ జంట ప్రతి పండుగానీ చక్కగా జరుపుకుంటారు. అలాగే ప్రతి దీపావళికి తప్పకుండా ఫోటోను షేర్ చేస్తారు.
ఐపీఎల్ కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఛాంపియన్ గా నిలబెట్టిన రోజు నుంచి గంభీర్ ప్రధాన కోచ్ కావాలనే చర్చలు తీవ్రమయ్యాయి. చివరకు అదే జరిగింది.