InPics: ఒలింపిక్ విజేతల కోసం గరిటె పట్టిన సీఎం అమరిందర్ సింగ్... క్రీడాకారులకు తానే వడ్డించిన వడ్డించిన సింగ్
పంజాబ్ నుంచి ఒలింపిక్స్లో పతకాలు గెలిచిన, ప్రాతినిథ్యం వహించిన అథ్లెట్ల కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ గరిటె పట్టారు. Image Credit/CMO Punjab Twitter
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమొహాలీలోని తన ఫాంహౌస్లో అథ్లెట్లకు సీఎం విందు ఏర్పాటు చేశారు.Image Credit/CMO Punjab Twitter
లింపిక్స్ జావెలిన్ త్రోలో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాతో పాటు ఆ రాష్ట్రానికి చెందిన పురుష, మహిళా హాకీ ప్లేయర్లు, ఇతర అథ్లెట్లు ఈ విందులో పాల్గొన్నారు. Image Credit/CMO Punjab Twitter
ఒలింపిక్స్లో పురుషుల హాకీ జట్టు కాంస్యం గెలవగా.. మహిళల జట్టు తృటిలో పతకానికి దూరమైన సంగతి తెలిసిందే. Image Credit/CMO Punjab Twitter
ఉదయం 11 గంటలకు వంట చేయడం మొదలెడితే సాయంత్రం 5 వరకూ కొనసాగింది. ఈ ప్రతి నిమిషాన్ని ఆస్వాదించినట్లు అమరిందర్ సింగ్ తెలిపారు. Image Credit/CMO Punjab Twitter
దేశానికి కీర్తి తేవడం కోసం అథ్లెట్లు ఎంతో శ్రమిస్తారు. దాని ముందు నేను చేసింది చాలా తక్కువే అని అమరిందర్ అన్నారు. Image Credit/CMO Punjab Twitter
మటన్ మసాలా, చికెన్, ఆలు కుర్మా, కోడి కుర్మా, బిర్యానీ, జర్దా రైస్ లాంటి నోరూరించే వంటకాలను అథ్లెట్ల కోసం సిద్ధం చేశారు.Image Credit/CMO Punjab Twitter