Ajinkya Rahane: అజింక్య రహానె @ 10 Years... అంతర్జాతీయ క్రికెట్లో రహానె అడుగుపెట్టి 10ఏళ్లు పూర్తి... స్పెషల్ పోస్టు చేసిన భార్య రాధిక
అజింక్య రహానె భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి 10 సంవత్సరాలు పూర్తయింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సందర్భంగా అతడి భార్య రాధిక ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రత్యేక మెసేజ్ చేసింది.
2011 ఆగస్టు 31న రహానె మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్ తో T20 కోసం భారత్ తరఫున అరంగేట్రం చేశాడు.
2021 ఆగస్టు 31తో రహానె అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి 10 ఏళ్లు పూర్తియింది.
2013లో మార్చిలో రహానె టెస్టుల్లోకి అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియాపై రహానె టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.
2011 సెప్టెంబరులో వన్డేల్లోనూ చోటు దక్కించుకున్నాడు. టీ20, వన్డేల్లో ఇంగ్లాండ్ పైనే రహానె అరంగేట్రం చేశాడు.
రహానె చివరిసారి 2016లో టీ20 మ్యాచ్ ఆడాడు. అలాగే 2018 ఫిబ్రవరిలో చివరి వన్డే ఆడాడు.
రహానె భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.
ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డు రహానె పేరిట ఉంది. 2015లో శ్రీలంకతో జరిగిన ఓ టెస్టులో రహానె 8 క్యాచ్‌లు పట్టాడు.
వన్డేల్లో వరుసగా ఐదు ఇన్నింగ్సుల్లో అర్థ శతకాలు సాధించిన 11వ ఆటగాడు రహానె.
టీ20ల్లో అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే రహానె 61 పరుగులు చేశాడు.
టీ20ల్లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు(4) పట్టిన రికార్డు రహానె పేరిట ఉంది.