Cricketers Century Record: టెస్టు క్రికెట్లో 100 కంటే తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాళ్లు
ఐదు రోజుల టెస్టు క్రికెట్లో 100 కంటే తక్కువ బంతులకు సెంచరీ చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ, పలువురు క్రికెటర్లు ఈ ఘనత సాధించారు. ఇంతకీ వారెవరు, ఎప్పుడు, ఏదేశంపై శతకం సాధించారో చూద్దాం.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవీరేంద్ర సెహ్వాగ్: టెస్టు క్రికెట్లో సెహ్వాగ్ 7 సార్లు 100 కంటే తక్కువ బంతులకే శతకాలు నమోదు చేశాడు. 2006లో మొదటిసారి 100 కంటే తక్కువ డెలివరీలకే సెంచరీ చేసేశాడు.
డేవిడ్ వార్నర్: ఈ ఆసీస్ క్రికెటర్ ఇప్పటి వరకు 4సార్లు వందకంటే తక్కువ బంతులకు శతకాలు బాదేశాడు. 2012లో మొదటిసారి భారత్ పైనే తొలిసారి 100 కంటే తక్కువ బాల్స్‌కి సెంచరీ చేశాడు.
క్రిస్ గేల్: ఈ వెస్టిండీస్ క్రికెటర్ 79 బంతుల్లోనే శతకం బాదేశాడు. మొత్తం 4సార్లు 100 కంటే తక్కువ బంతుల్లో శతకం నమోదు చేయగా అందులో రెండు దక్షిణాఫ్రికా పై సాధించడం విశేషం.
బ్రెండన్ మెకల్లమ్: ఈ కివీస్ క్రికెటర్ 4 సార్లు 100 కంటే తక్కువ బంతులకే సెంచరీ చేశాడు. 2005లో జింబాబ్వేపై అతడు మొదటిసారి తక్కువ బంతులకు సెంచరీ నమోదు చేశాడు.
షాహిద్ అఫ్రిది: ఈ పాకిస్థాన్ క్రికెటర్ మొత్తంగా 3 సార్లు 100 కంటే తక్కువ బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. రెండుసార్లు 78 బంతులకే సెంచరీ చేసేశాడు.
అడమ్ గిల్‌క్రిస్ట్: ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో మొత్తం 6 సార్లు 100 కంటే తక్కువ బంతులకే సెంచరీ చేసేశాడు. 2001లో మొదటిసారి భారత్ పైనే అతడు వంద కంటే తక్కువ బాల్స్‌కే శతకం బాదేశాడు.
రాస్ టేలర్: ఈ కివీస్ ఆటగాడు 2 సార్లు 100 కంటే తక్కువ బంతులకు సెంచరీ సాధించాడు.
ఇయాన్ బోథమ్: ఇంగ్లాండ్‌కు చెందిన ఇయామ్ బోథమ్ మొత్తం 3 సార్లు 100 కంటే తక్కువ బంతులకే సెంచరీ నమోదు చేశాడు. 1981లో మొదటిసారి ఆస్ట్రేలియాపై శతకం చేశాడు.