Tirumala TTD Top Decisions: భక్తులకు 2, 3 గంటల్లో శ్రీవారి దర్శనం, అన్య మతస్తులు ఔట్ - టీటీడీ కీలక నిర్ణయాలివే
తిరుమలలోని అన్నమయ్య భవనంలో బీఆర్ నాయుడు అధ్యక్షతన సోమవారం ఉదయం టీటీడీ నూతన ధర్మకర్తల మండలి తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు పాలక మండలి నిర్ణయం తీసుకుంది. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకున్నారు.
తిరుమలకు వచ్చే భక్తులకు 2 లేదా 3 గంటల్లోనే దర్శనమయ్యేలా ఒక నిపుణుల కమిటీ ఏర్పాటుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజన్స్ ఉపయోగించి క్యూ లైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా చర్యలు తీసుకోవాలని చర్చించారు.
తిరుమలలో డంపింగ్ యార్డులోని చెత్తను 3, 4 నెలల్లో క్లియర్ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. తిరుపతిలోని శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు.
తిరుమలలో గతంలో రాజకీయాలు మాట్లాడారని, ఇకనుంచి తిరుమల క్షేత్రంలో రాజకీయాలు మాట్లాడేవారిపై, పార్టీల గురించి ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది.
శ్రీవాణి ట్రస్టు పేరును మార్చేందుకు అవకాశాలను పరిశీలించి వచ్చే సమావేశంలో రిపోర్టు ఇవ్వాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సభ్యులను ఆదేశించారు. తిరుపతి స్థానిక ప్రజలకు ప్రతి నెలలో మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు.