Padmavathi Brahmotsavam: కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ స్వామి అలంకారంలో సిరులతల్లి దర్శనం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం (డిసెంబర్ 1న) ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజగోపాలస్వామివారి అలంకారంలో చంద్రకోలు, దండం ధరించి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకల్పవృక్ష వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో అమ్మవారిని కీర్తించారు. మంగళ వాయిద్యాల నడుమ, చిరుజల్లుల మధ్య పద్మావతి అమ్మవారి కల్పవృక్ష వాహనసేవ కోలాహలంగా జరిగింది.
పాల కడలిని అమృతం కోసం మథించిన సమయంలో లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం. ఆకలిదప్పుల్ని తొలగించి, పూర్వ జన్మస్మరణను ప్రసాదించనుంది ఉదార దేవతావృక్షం కల్పవృక్షం అన్ని కోరికలనూ తీరుస్తుంది.
ఖడ్గాన్ని, యోగదండాన్ని ధరించే గోపకిశోరుడిలా గోసంపదను పరిరక్షించే మంగళదేవత అలమేలుమంగ. ఆ అమ్మవారి పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య కీర్తించాడు. కోరిన కోర్కెలను తీర్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలమేలుమంగ ఆశ్రిత భక్తులకు లేముల్ని తొలగించే పరిపూర్ణశక్తిగా దర్శనమిచ్చారు.
అమ్మవారి కల్పవృక్షం వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో జె.శ్యామల రావు, జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
image 5
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు మూడో రోజు శనివారం సాయంత్రం సింహ వాహనంపై దర్శనమిచ్చారు. సేవ విశిష్టతను తెలుసుకుందాం. శీఘ్ర గమనానికి, సింహం పరాక్రమానికి, వాహన శక్తికి ప్రతీకగా అమ్మవారు సింహ వాహనంపై ఊరేగుతూ భక్తులను కనికరించారు.
కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ స్వామి అలంకారంలో సిరులతల్లి చంద్రకోలు, దండం ధరించి భక్తులకు అభయమిచ్చారు.
ఎస్వి సంగీత నృత్య కళాశాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు నవదుర్గల వేషధారణ, భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శించారు. కర్ణాటకకు చెందిన 27 మంది కళాకారులు క్షీరసాగర మథనం, పౌరాణిక పాత్రలతో భక్తులను ఆకట్టుకున్నారు.
అమ్మవారి కల్పవృక్ష వాహనసేవలో పలు రాష్ట్రల నుంచి విచ్చేసిన కళాబృందాలు అద్భుత ప్రదర్శనలు ఇచ్చాయి. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 10 కళాబృందాలు, 238 మంది కళాకారులు పాల్గొని తమ సంగీత నృత్య ప్రదర్శనలతో అలరించారు.