Seethakka - Naari Movie: మహిళల పట్ల వివక్ష, చిన్నచూపు తగ్గడం లేదు - నారి టైటిల్ గ్లింప్స్ లాంచ్లో సీతక్క
Telangana Minister Seethakka launches Naari Title Glimpse: మహిళల్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ఆడ పిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలనే కథాంశంతో దర్శకుడు సూర్య వంటిపల్లి తెరకెక్కించిన సినిమా 'నారి'. తెలంగాణ మంత్రి సీతక్క చేతుల మీదుగా సినిమా టైటిల్ గ్లింప్స్, రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదినీ 'నారి' సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. శ్రీమతి శశి వంటిపల్లి నిర్మించారు. సెన్సార్ సహా అన్ని పనులు పూర్తి చేసుకున్న 'నారి' చిత్రాన్ని డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల చేయనున్నారు.
'నారి' టైటిల్ గ్లింప్స్, పోస్టర్ విడుదల చేసిన తర్వాత ''ఇప్పుడు మహిళలు ఎన్నో రంగాల్లో ఎదుగుతున్నారు. అయినా సరే ఆడవాళ్ళ పట్ల వివక్ష, చిన్నచూపు తగ్గడం లేదు. ఆడ పిల్లలు ఎదిగేందుకు అందరూ తోడ్పాడు అందించాలని, మహిళల్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలనే గొప్ప కథాంశంతో సినిమా చేసిన సూర్య వంటిపల్లి గారికి అభినందనలు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి'' అని తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.
''ఇటీవల ఓ స్కూల్ స్టూడెంట్ వీడియో వైరల్ అయ్యింది. అందులో ఓ చిన్నారి అమ్మాయిగా తన కష్టాలు చెబుతూ... మగవాడిగా మారాలని అనుకుంటున్నట్లు చెబుతుంది. అది మా సినిమాలోది. ఆ అమ్మాయి పాత్రలో నిత్య శ్రీ నటించింది. మహిళల పట్ల సమాజం ఎలా వ్యవహరించాలి? ఎటువంటి మద్దతు ఇవ్వాలి? వంటి కథతో రూపొందిన చిత్రమిది. ప్రతి మహిళ తమ ఇంట్లో మగవాళ్ళతో కలిసి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నా'' అని దర్శకుడు సూర్య చెప్పారు.
ఆమని, వికాస్ వశిష్ఠ, కార్తికేయ దేవ్, నిత్య శ్రీ, మౌనిక రెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదినీ, 'ఛత్రపతి' శేఖర్, నాగ మహేశ్, సునైన, రామచంద్ర, రాజశేఖర్, ఫణి, గీతాకృష్ణ రెడ్డి, ధృవన్ వర్మ, రాజమండ్రి శ్రీదేవి, సత్తన్న తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వినోద్ కుమార్, పాటలు: భాస్కరభట్ల - ప్రసాద్ సాన.