Tiruchanoor Padmavathi Brahmotsavam: సర్వభూపాల వాహనంపై పద్మావతి అమ్మవారు.. సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గరుడవాహనసేవ!
మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, భజనల నడుమ మాడవీధుల్లో సర్వభూపాల వాహనంపై విహరించారు అమ్మవారు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఉదయం 8 గంటల నుంచి 10 గంటలవరకూ వైభవంగా జరిగింది వాహన సేవ. అడుగడుగునా భక్తులు హారతులు సమర్పించి అమ్మను దర్శించుకున్నారు
శ్రీవారి హృదయపీఠంపై కొలువై లోకాన్ని కటాక్షిస్తున్న అలమేలుమంగను... సర్వభూపాలురు వాహనస్థానీయులై సేవించి తరిస్తున్నారు.
'రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే' అని వేదాల్లో చెప్పినట్టు...రాజాధిరాజు అయిన శ్రీ విష్ణువు అర్థాంగి పద్మావతిని సర్వభూపాలురు తమ భుజస్కంధాలపై మోస్తున్నారు.
సర్వభూపాల వాహనంపై అమ్మవారిని దర్శించుకుంటే కీర్తి, యశస్సు, పదవీ యోగం సిద్ధిస్తుందని పండితులు చెబుతారు
ఆరోరోజు సాయంత్రం 4.20 నుంచి 5.20 గంటల వరకు అమ్మవారు స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు.
రాత్రి 7 నుంచి 9 వరకూ గరుడవాహనంపై అనుగ్రహిస్తారు పద్మావతి అమ్మవారు