Tirumala: 21 కళాబృందాలు 536 మంది కళాకారులు, తప్పెటగుళ్లు నుంచి కథాకళి వరకూ ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు సాయంత్రం హంసవాహన సేవలో కళాప్రదర్శనలు ఆకట్టుకున్నాయి
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలుగురాష్ట్రాలతో పాటూ కర్ణాటక, మహారాష్ట్ర, అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఝార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి కళాకారులు తరలివచ్చారు
మొత్తం 21 కళాబృందాలు 536 మంది కళాకారులు ప్రత్యేక నృత్యాలతో అలరించారు
నృత్యాలు, వాయిద్యాలు, భజనలతో శ్రీవారి భక్తులను మంత్రముగ్ధుల్ని చేశారు.
కేరళకు చెందిన కళాకారులు కథాకళి, తెలుగు రాష్ట్రాలకు చెందిన కళాకారులు కూచిపూడి, భరతనాట్యం, కోలాటాలు, తప్పెటగుళ్ళు ప్రదర్శించారు
గుజరాత్ – గర్భా నృత్యం, అస్సాం – సత్రియ నృత్యం, రాజస్థాన్ – జఖరీ నృత్యం, ఝార్ఖండ్ – చౌ నృత్యంతో అలరించారు.
మహారాష్ట్ర – లావణి, పశ్చిమ బెంగాల్ – రాధాకృష్ణ రాసలీలల ప్రదర్శన కన్నులపండువగా ఉంది
కర్ణాటక – హనుమాన్ చాలీసా నృత్య రూపకం, మహారాష్ట్ర - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కళాకారుల డ్రమ్స్ భక్తులను మైమరిపించాయి.
దీపం నృత్యాలు, భజనలు, జానపద నృత్యాలు, కోలాటాలు, భక్తి, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా నిలిచాయి
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు సాయంత్రం హంసవాహన సేవలో కళాప్రదర్శనలు