Sri Padmavati Ammavari Brahmotsavalu 2024: తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు వెళ్లేవారు వీటిని తప్పనిసరిగా సందర్శించండి!
తిరుచానూరు లో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రదర్శన శాల ప్రారంభించారు ఈవో శ్రీ జె.శ్యామలరావు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశుక్రవారపు తోటలో ఉద్యాన విభాగం ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శన, శిల్ప కళాశాల ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శన, ఆయుర్వేద ప్రదర్శన కన్నుల పండువగా ఉన్నాయి
పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులంతా ఈ ప్రదర్శనలు సందర్శించాలని పిలుపునిచ్చారు ఈవో శ్రీ జె.శ్యామలరావు.
నవంబరు 28 న ప్రారంభమైన తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు డిసెంబరు 6 వరకు వైభవంగా జరుగుతాయి
భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు.
అమ్మవారి బ్రహ్మోత్సవాలు వచ్చే భక్తులకు తిరుమల తరహాలోనే తిరుచానూరులో కూడా అన్న ప్రసాద వితరణ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ఆలయ పరిసరాల్లో భక్తుల కోసం చలువపందిళ్లు, క్యూలైన్ల నిర్వహణ, బారీకేడ్లు ఏర్పాట్లు, మాడ వీధుల అలంకరణ ఈ ఏర్పాట్లన్నీ ముందుగానే పూర్తిచేశారు
బ్రహ్మోత్సవాలను భక్తులు సౌకర్యవంతంగా చూసేందుకు వీలుగా తిరుచానూరు పరిసర ప్రాంతాలతో పాటు, పద్మ పుష్కరిణి నాలుగు వైపులా 20 LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు
పుష్కరిణిలో భక్తులు ప్రవేశించేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి వెళ్లేందుకు ముందస్తు ఏర్పాట్లు చేశారు
తిరుచానూరు లో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రదర్శన శాల
తిరుచానూరు లో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రదర్శన శాల