Money On Roads: రోడ్డుపై పడిన డబ్బు తీసుకోవడం సరైనదా కాదా? మీరు ఆశ్చర్యపోయే సమాధానం ఇది!
రోడ్డు మీద డబ్బులు దొరకడం ఒక శుభ సూచనగా భావిస్తారంతా.. కానీ వాటిని తమ దగ్గర ఉంచుకోకూడదట..ఇది కూడా దొంగతనానికి సమానంగా పరిగణిస్తారని అన్నారు ప్రేమానంద మహారాజ్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమనది కాని ధనాన్ని మన సొంతానికి ఉపయోగించుకోవడం సముచితం కాదు. రహదారిపై డబ్బులు దొరికితే, వాటిని తీసుకుని అవసరమైన వారికి దానం చేయవచ్చు లేదా ఏదైనా ధార్మిక కార్యాలలో ఉపయోగించవచ్చు.
రోడ్డు మీద దొరికిన డబ్బుతో గోమాతకు సేవ చేయాలి, దీనివల్ల పుణ్యం లభిస్తుంది. ఈ డబ్బును తమ స్వలాభం కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం సరైన దిశలో ఉపయోగించడమే సద్భావనకు నిదర్శనం.
ఇలాంటి కార్యాల వల్ల సమాజంలో సానుకూలత వ్యాప్తి చెందుతుంది..మీ మంచి ఉద్దేశం మీ పాపాలన్నింటినీ తొలగిస్తుంది. ఇళ్లలో లేదా ఏదైనా బహిరంగ ప్రదేశంలో పనిచేసే వారు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అని ఆయన అన్నారు.
రహదారిపై లేదా ఇంక ఎక్కడైనా కానీ డబ్బులు మీవికానివి కనిపిస్తే తీసుకోండి..కానీ వాటిని సరైన మార్గంలో వినియోగించండని సూచిస్తున్నారు ప్రేమానంద మహారాజ్