ఆ పరమేశ్వరుడికే గురువై ఓంకారానికి అర్థం చెప్పిన స్వామిమలై క్షేత్రాన్ని దర్శించుకున్న పవన్ కళ్యాణ్!

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా కేరళ, తమిళనాడులో వరుస ఆలయాలు సందర్శిస్తున్నారు
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ఫిబ్రవరి 13 గురువారం తమిళనాడు తంజావూరు చేరుకున్నారు.. కుంభకోణం సమీపంలో ఉన్న స్వామిమలై క్షేత్రాన్ని దర్శించుకున్నారు

ఇక్కడ శ్రీ స్వామినాథగా పూజలందుకుంటున్న కుమారస్వామిని దర్శించుకున్నారు.
పవన్ కళ్యాణ్ తో పాటూ అకీరానందన్ కూడా ఆలయాల సందర్శనకు వెళ్లాడు
విజయం, జ్ఞానం, విజ్ఞానం కోసం భక్తులు స్వామిమలై క్షేత్రాన్ని దర్శించుకుంటారు
కుంభకోణం సమీపంలో ఉన్న స్వామిమలై సుబ్రహ్మణ్య స్వామికి ఉన్న ఆరు ముఖ్యమైన క్షేత్రాలలో నాలుగోది
సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు తన పుత్రుడిని గురువుగా చేసుకుని ప్రణవ స్వరూపమైన ఓంకారానికి అర్థం చెప్పించుకున్న పవిత్ర ప్రదేశం స్వామిమలై
కొండపై మురుగన్ కొలువై ఉండగా..తల్లిదండ్రులైన పార్వతి పరమేశ్వరురు కొండ దిగువ భాగంలో దర్శనమిస్తారు.