Bathukamma Festival 2024: చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ ... ఆటపాటలతో ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు!
భాద్రపద అమావాస్య రోజు నుంచి బతకుమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాలయ అమావాస్య రోజు సాయంత్రం మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ జరుపుకున్నారు. బతుకమ్మ ఆటపాటలతో సందడే సందడి..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణ అస్తిత్వానికి చిహ్నం బతుకమ్మ పండుగ. ప్రకృతే పరమాత్మ అని పూలనే అమ్మవారిగా భావించి తొమ్మిది రోజుల పాటు పూజించే ఈ పండుగ వెనుక కథలెన్నో..
అందమైన రంగురంగుపూలను తీసుకొచ్చి అందంగా పేర్చి బతుకమ్మగా భావిస్తారు..మధ్యలో గౌరీదేవికి ప్రతిరూపంగా పసుపు ముద్దని పెడతారు.
కొందరు పూలను శివలింగాకారంలో పేరిస్తే..మరికొందరు బౌద్దుల స్థూపాకారంలో పేర్చుతారు
అప్పట్లో నిత్యం సంచారంలో ఉండే బౌద్ధులు మత ఆరాధనలో భాగమైన స్తూపాలను ఇసుక, రాళ్లు, పూలు వారికి దొరికిన వస్తువులతో పేర్చి పూజించి నిమజ్జనం చేసేవారు.. అలా తెలంగాణ ప్రాంతంలో గిరిజనులు వారిని అనుకరించడం ప్రారంభించారు.. రాను రాను..తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు
మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మగా మహాలయ అమావాస్య రోజు పూజచేస్తారు. అందంగా బతుకమ్మని తయారు చేసి ఇరుగుపొరుగు ఆడిపాడతారు. అటుకులు, పప్పు బెల్లాలు నైవేద్యంగా సమర్పించి అందరకీ పంచుకుంటారు
స్త్రీలో మాతృత్వ కోణానికి నిదర్శనంగా తల్లిబతుకమ్మ, పిల్ల బతుకమ్మ అని రెండు తయారు చేస్తారు. అందంగా తయారు చేసిన బతుకమ్మ అమ్మలా తమను చల్లగా కాపాడుతుందని భావిస్తారు
శతాబ్ధాలక్రితం ప్రారంభమైన బతుకమ్మ సంప్రదాయం ఎలా మొదలైందో చెప్పేందుకు ఎన్నో కథలున్నాయి. భూస్వాముల పెత్తందారీతనాన్ని భరించలేక ఎందరో మహిళలు ఆత్మహత్య చేసుకనేవారు..వారిని తలుచుకుంటూ రంగురంగుపూలను పేర్చి బతుకమ్మా , బతకునీయమ్మా అంటూ గౌరమ్మను పూజించడం ప్రారంభించారు
శివుడి తలపై గంగను చూసి అసూయ చెందిన పార్వతీ దేవికి..తల్లి ఓ వరమిచ్చిందట. ఆ గంగపై నిన్ను పూల తెప్పలా తేలించి పూజిస్తారని.. ఇలా బతుకమ్మ వెనుక కథలెన్నో...
ఓ దంపతులకు పిల్లలంతా చనిపోవడంతో..గౌరమ్మను పూజించారు. అప్పుడు పుట్టిన బిడ్డ బతకాలని భావించి బతుకమ్మ అనే పేరు పెట్టారట. అప్పటి నుంచి అంతా ఆయురారోగ్యాలతో ఉండాలని భావిస్తూ బతుకమ్మ జరుపుకుంటున్నారు
గిరిజన ప్రాంతాల్లో, పల్లెల్లె, పట్టణాల్లో, మహానగరాల్లో ఇలా ఇప్పుడు సరిహద్దులు దాటి విదేశాల్లోనూ బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. తెలంగాణ ఆడబిడ్డలు ఎక్కడున్నా బతుకమ్మ జరుపుకుంటారు.. అందరి జీవితాల్లో బతకుమ్మ అంతలా భాగమైపోయింది.