Bathukamma 2023: తెలంగాణలో ఎంగిలిపూల బతుకమ్మ సందడి!
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబతుకమ్మ వేడుకల్లో తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ
భాద్రపద అమావాస్య రోజు ఎంగిలి బతుకుమ్మతో ప్రారంభమైన వేడుకలు ఆశ్వయుద్ధ శుద్ధ అష్టమి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది
అంటు వ్యాధులు, కరువు కాటకాల నుంచి ప్రజల్ని కాపాడాలని ప్రార్థిస్తూ ప్రకృతి గౌరిని ఆటపాటలతో పూజించే వేడుకే ఇది.
తెలంగాణ పల్లె పల్లెల్లో జరుపుకునే బతుకమ్మ ఇప్పుడు ఎల్లలు దాటి దేశ విదేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటున్నారు.
దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం కోసం ఎన్నో పూజలు చేశారు. అలా అమ్మవారి అనుగ్రహంతో ఓ బిడ్డ కలిగింది. ఎన్నో గండాలు దాటి బిడ్డ భూమ్మీదపడడంతో ఆమెకు బతుకమ్మ అని నామకరణం చేశారట. అప్పటి నుంచీ బతుకు ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలుస్తారని పురాణగాథ.
ఆత్మత్యాగంతో తెలంగాణలో ఓ పల్లెను వరదబారినుంచి కాపాడిన త్యాగమూర్తి బతుకమ్మ అని కొందరంటారు
మహిషాసురుడిని చంపిన తర్వాత అలసి సొలసి మూర్ఛపోయిన అమ్మవారిని లేపేందుకు...మహిళలంతా కలిసి పాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నం చేశారని..బతుకమ్మ బతుకమ్మ అని పాటలు పాడారని మరో కథనం
ఓ రైతు దంపతులకు పిల్లలు పుట్టి చనిపోయేవారు. ఇలా ఏడుగురు పుట్టి చనిపోగా 8వ బిడ్డకు బతుకమ్మ అని పేరు పెట్టడంతో ఆమె బతికిందనేది మరో కథనం.
పూర్వం పిల్లలు లేని దంపతులు ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శిస్తుండగా వారికి ఓ ప్రాంతంలో ఓ ఆడబిడ్డ దొరికింది. అమ్మవారే తమకు ఇచ్చిందనే ఆనందంతో ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తారు. ఆమె పెరుగతూ..ఎన్నో మహిమలు చూపేదట. దీంతో ఆమెను ఓ దేవతగా కొలిచేవారు చుట్టుపక్కలవారు. ఆమెనే బతుకమ్మ అని ఓ కథ చెబుతోంది.
తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాల్లో బతుకమ్మని కొలిచి చివరి రోజు సద్దుల బతుకమ్మని పెద్ద పండగా భావిస్తారు. ఆ రోజు తొమ్మిదిరకాల సద్దులు తయారు చేస్తారు.
గునుగ, తంగేడు పూలతోపాటు పూలన్నింటినీ వలయాకారంగా పేర్చుకుంటూ ఆకర్షణీయంగా బతుకమ్మని తయారుచేసి మధ్యలో పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు.
బతుకమ్మను ఇంట్లో పూజ చేసి ఆ తర్వాత బయటకి తీసుకొచ్చి బతుకమ్మ చుట్టూ ఆడిపాడతారు. ఆ తర్వాత ఘనంగా నిమజ్జనం చేస్తారు.
ఈ ఏడాది 14 అక్టోబర్ నుంచి 22 అక్టోబర్ వరకూ బతుకమ్మ వేడుకలు
మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ పితృ అమావాస్య (మహాలయ అమావాస్య – భాద్రపద అమావాస్య) రోజు జరుగుతుంది.
తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ
తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ
తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ