Maha Kumbh 2025: మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేసిన UAE సహా పది దేశాల ప్రతినిధులు

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళా కోసం ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వచ్చి స్నానాలు ఆచరిస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న మహాకుంభ్ ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇవాళ 10 దేశాలకు చెందిన 21 మంది సభ్యుల బృందం సంగమంలో పుణ్యస్నానం చేసింది.
భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖలోని ఎక్స్టర్నల్ పబ్లిసిటీ అండ్ పబ్లిక్ డిప్లమసీ విభాగం వీళ్లను ఆహ్వానించింది.
10 దేశాల నుంచి 21 మంది సభ్యుల బృందం బుధవారం (జనవరి 15) ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంది.
ఉత్తరప్రదేశ్ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్మించిన ఆరైల్ ప్రాంతంలో ఉన్న టెంట్ సిటీలో బస చేశారు.
విదేశీయ ప్రతినిధుల బృందం మహాకుంభమేళా ప్రాంతంలో పర్యటించింది.
సాయంత్రం 5:00 నుంచి 6:30 గంటల వరకు నిర్వహించిన హెరిటేజ్ వాక్‌లో వీళ్లంతా పాల్గొన్నారు.
ప్రయాగ్‌రాజ్ సాంస్కృతిక, చారిత్రక వారసత్వ సంపద గురించి తెలుసుకున్నారు.
రాత్రి టెంట్ సిటీలో విందు ఆరగించి విశ్రాంతికి తీసుకున్నారు.
ఈ విదేశీ బృందం జనవరి 16, గురువారం ఉదయం 8:00 గంటలకు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసింది.
స్నానం ఆచరించిన తర్వాత అల్పాహారం తర్వాత 9:30 గంటలకు హెలికాప్టర్లో ట్రావెల్ చేసి మహాకుంభ్ ప్రాంతాన్ని విహంగ వీక్షణం చేశారు.
మధ్యాహ్నం 1:30 గంటలకు టూర్ ప్రోగ్రాం ముగించుకున్న ఈ బృందం విమానాశ్రయానికి బయల్దేరి వెళ్లి సొంత దేశానికి పయనమైంది.
ఫిజీ, ఫిన్లాండ్, గయానా, మలేషియా, మారిషస్, సింగపూర్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ట్రినిడాడ్ అండ్ టొబాగో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రతినిధులు ఈ టీంలో ఉన్నారు.