Gulab Jamun Recipe : పర్ఫెక్ట్ రుచితో గుండ్రని గులాబ్ జామున్ చేసేయండిలా.. సింపుల్, టేస్టీ రెసిపీ
గులాబ్ జామున్‌ని తినడానికి ఈజీగా ఉంటుంది. కానీ దానిని తయారు చేయడానికి కొందరు కష్టపడతారు. గుండ్రని గులాబ్ జామున్‌ని పగలకుండా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగులాబ్ జామున్ పౌడర్ తీసుకుని దానిలో పాలు వేసుకుని పిండిని మృదువుగా కలపాలి. పిండి ముద్దలు లేకుండా మొత్తం కలిసి స్మూత్‌గా ఉండేలా కలుపుకోండి. కాస్త లూజ్‌గా ఉంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి.
అనంతరం పిండిని తీసుకుని చిన్న చిన్న బాల్స్‌గా చుట్టుకోవాలి. మీకు నచ్చిన పరిమాణంలో వీటిని చుట్టుకోవాలి. బాల్స్‌లో ఎలాంటి పగుళ్లు లేకుండా ఉండేలా చూసుకోవాలి. అలా ఉంటే వేయించేప్పుడు జామున్ విడిపోతుంది.
ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి.. దానిలో ముందుగా తయారు చేసుకున్న జామున్స్ వేయాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చే మీడియం మంట మీద ఉంచి వేయించుకోవాలి. అన్నివైపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసేయాలి.
మరొ స్టౌవ్‌పై షుగర్ సిరప్‌ను చేసుకోవాలి. షుగర్ వేసి నీళ్లు వేసి దానిలో పంచదార కరిగిపోయే వరకు చూసుకోవాలి. దానిలో యాలకుల పొడి వేసి ఉడికించుకోవాలి. కాసేపటికి స్టౌవ్ ఆపేయాలి.
ముందుగా వేయించుకున్న గులాబ్ జామున్లను సిరప్‌లో వేయాలి. జామున్‌లో సిరప్‌లో పూర్తిగా మునిగేలా చూసుకోవాలి. అరగంట నుంచి గంటపాటు అలా పక్కకి పెట్టేస్తే.. వాటిలోకి సిరప్ వెళ్లి మంచిగా ఉబ్బుతాయి.
అంతే టేస్టీ, గుండ్రని గులాబ్ జాములు రెడీ. వీటిని మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని.. ఐస్‌క్రీమ్ కాంబినేషన్‌తో తినొచ్చు. లేదంటే నేరుగా కూడా తినవచ్చు.