YS Rajasekhar Reddy : ఇడుపులపాయలో వైఎస్ జయంతి వేడుకలు- పాల్గొన్న జగన్, విజయమ్మ, భారతి, వైసీపీ నేతలు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇడుపులపాయలో నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో వైసీపీ అధినేత జగన్, విజయమ్మ, భారతితోపాటు వైసీపీ లీడర్లు పాల్గొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఆయన సమాధి వద్ద ప్రత్యేకంగా పుష్ప గుచ్చాలు ఉంచిన కుటుంబ సభ్యులు, వైసీపీ లీడర్లు నివాళి అర్పించారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఇడుపులపాయలో కూడా నిర్వహించేందుకు వైసీపీ ఏర్పాట్లు చేసింది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైసీపీ లీడర్లు, కార్యకర్తలు రక్తదానం, వస్త్రాలు, పండ్లు పంపిణీ చేస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కూడా భారీ కార్యక్రమం చేపట్టారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ కీలక నేతలంతా హాజరుకానున్నారు.
కడప జిల్లా జమ్మలమడుగులో 1949 జులై 8న జన్మించిన వైఎస్ఆర్... వైద్య విద్యను అభ్యసించి ప్రజలకు రూపాయికే వైద్యం అందించి రూపాయి డాక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు.
రూపాయి డాక్టర్‌గా పేరు తెచ్చుకున్న వైఎస్ఆర్ 1978లో రాజకీయ అరంగేట్రం చేసిన ఎమ్మెల్యేగా, ఎంపీగా, ప్రతిపక్షనాయకుడిగా ఎదిగారు. 2004లోప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు.
పాదయాత్రలో ఉచిత విద్యుత్ హామీ ఇచ్చి సంచలనం రేపిన వైఎస్ఆర్ సీఎంగా మొదటి సంతకం ఆ ఫైల్‌పైనే చేశారు.
మొదటి సంతకం అనే పదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన నాయకుడు సంక్షేమ సారథిగా పేరు పొందిన వైఎస్ఆర్ 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు.