Turkey Earthquake : అల్లకల్లోలమైన టర్కీ, సిరియా- ప్రకృతి కోపానికి 2300 మంది మృతి!
టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటికే భారీగా ప్రాణ నష్టం సంభవించగా.. మృతుల సంఖ్య 2300కు చేరుకుంది.(Image Source: AP)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆగ్నేయ టర్కీ ప్రాంతంలో, ఉత్తర సిరియాలో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8 గా నమోదు అయింది. (Image Source: AP)
భూకంప తీవ్రతకు భారీ భవనాలు నిమిషాల్లో నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద చిక్కుకుని, మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. (Image Source: AP)
టర్కీలోని 10 నగరాల్లో భూకంప తీవ్రత అధికంగా ఉంది. ఈ భూకంపం కారణంగా వందలాది మంది చనిపోగా, వేలాది మంది గాయపడ్డారు. (Image Source: AP)
టర్రీ కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. (Image Source: AP)
ఆగ్నేయ టర్కీలోని గాజియాన్‌తెప్ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. (Image Source: AP)
దక్షిణ టర్కీ, ఉత్తర సిరియాలోని పలు ప్రాంతాల్లో భూకంపం తీవ్ర ప్రభావం ఎక్కువగా ఉంది. టర్కీలోని దియర్‌బకీర్, సిరియాలోని అలెప్పో, హమా నగరాల్లో వందలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. (Image Source: AP)
తొలి భూకంపం సంభవించిన తర్వాత గంటల వ్యవధిలో 20 సార్లు భూప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతగా ఎక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. (Image Source: AP)
ప్రపంచ దేశాల్లోని ప్రజలు టర్కీ కోలుకోవాలని ప్రార్థనాలు చేస్తున్నారు
సిరియాలోని ప్రభుత్వ నియంత్రణ ఉన్న ప్రాంతాలు, రెబల్స్ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో 783 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. (Image Source: AP)
భవనాల శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అధికారుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.(Image Source: AP)
టర్కీలోని 10 ప్రావిన్సుల్లో భూకంపం విలయం సృష్టించింది. ఇప్పటివరకు 2300 మంది మరణించినట్లు అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. 5300 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. భూకంప తీవ్రతతో టర్కీలో దాదాపు 3 వేల భవనాలు ధ్వంసమయ్యాయి. (Image Source: AP)
సోమవారం తెల్లవారుజామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ పెను ప్రమాదం జరిగింది. (Image Source: AP)
టర్కీ, సిరియా దేశాల కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు