Earth Rotation Accelerating: భూమి భ్రమణ వేగం పెరుగుతోంది, రోజు చిన్నగా మారిపోతుందా ? ఇంకా ఈ ప్రభావం మనపై ఎలా ఉండబోతోందో తెలుసా?
భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి సూర్యుని చుట్టూ ఒక అండాకార మార్గంలో తిరుగుతుంది, దీనినే పరిభ్రమణం అంటారు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందనే విషయం మనందరికీ తెలుసు, అందుకే 24 గంటల రోజు ఉంటుంది. కానీ రాబోయే రోజుల్లో రోజు 24 గంటలు కాకుండా తక్కువ సమయం ఉంటుందని మీకు తెలుసా? భూమి తన అక్షంపై తిరిగే వేగం పెరుగుతోంది..ఫలితంగా రోజు సమయం మరింత తగ్గిపోతుంది..ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాబోయే రోజుల్లో మనకు 24 గంటల కంటే తక్కువ సమయం ఉండబోతోందట.. ముఖ్యంగా జూలై 22 , ఆగస్టు 5 తేదీలలో భూమి వేగంగా తిరగడం వల్ల రోజు చిన్నదిగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఈ వ్యత్యాసం రెగ్యులర్ డేస్ కన్నా కొన్ని మిల్లీసెకండ్లలోనే ఉంటుంది. 1.3 నుంచి 1.5 మిల్లీసెకండ్ల వరకు రోజు చిన్నదిగా ఉంటుంది.
ఈ తగ్గిన కాలాన్ని సాధారణంగా ఎవరూ గుర్తించలేరు, దీనిని కొన్ని పరికరాల సహాయంతో మాత్రమే కొలవవచ్చు. భూమి యొక్క భ్రమణ కాలం ఎల్లప్పుడూ స్థిరంగా ఉండదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
సూర్యుడు , చంద్రుని స్థానాలు, భూమి అయస్కాంత క్షేత్రంలో మార్పులు ... గ్రహం మీద ద్రవ్యరాశి సమతుల్యతతో సహా అనేక విషయాల ద్వారా భూమి భ్రమణం ప్రభావితమవుతుంది.
పరిశోధకుల ప్రకారం 1 బిలియన్ నుంచి 2 బిలియన్ సంవత్సరాల క్రితం, భూమిపై ఒక రోజు కేవలం 19 గంటలు మాత్రమే ఉండేది. చంద్రుడు మన గ్రహానికి దగ్గరగా ఉండటం వల్ల ఇది సాధ్యమైంది.
కేవలం ఈ రెండు రోజుల్లో భూమి తిరగడంలో వేగం పెరగడం వల్ల మనిషి జీవితంపై ఎటువంటి ప్రభావం ఉండదు..దీనిని ఎవరూ గుర్తించలేరు కూడా