Kerala: ఈ ఫొటోలు చూశాక ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేయకుండా ఉండలేం, వయనాడ్ హీరోలు వీళ్లే
వయనాడ్ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇండియన్ ఆర్మీతో పాటు NDRF సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. స్థానికంగా ఎమర్జెన్సీ టీమ్స్ కూడా రెస్క్యూలో పాల్గొంటున్నాయి. కూలిపోయిన భవనాల్లో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకూ 308 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మంది గల్లంతయ్యారు. సహాయక చర్యలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే పలు చోట్ల రెస్క్యూ ఆపరేషన్ కోసం తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుంటున్నాయి టీమ్స్.
సహాయక చర్యలకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. రోడ్లు, వంతెనలు కూలిపోవడం వల్ల తాత్కాలికంగా ఓ బ్రిడ్జ్ నిర్మించింది ఇండియన్ ఆర్మీ. 190 అడుగులు పొడవైన బెయిలీ బ్రిడ్జ్‌ని అతి తక్కువ సమయంలో నిర్మించి రికార్డు సృష్టించింది. ఇరువంజిప్పుర నదిపై ఈ వంతెన కట్టారు సైనికులు.
మందక్కై, చూరల్మల ప్రాంతాన్ని కనెక్ట్ చేస్తూ అంతకు ముందు ఇక్కడ ఓ బ్రిడ్జ్ ఉండేది. కానీ కొండ చరియలు విరిగి పడడం వల్ల ఈ వంతెన పూర్తిగా ధ్వంసమైపోయింది. అప్పటి నుంచి ఈ రెండు ప్రాంతాలకు రాకపోకలు తెగిపోయాయి. రెస్క్యూకి ఇబ్బందిగా ఉందని గమనించిన ఆర్మీ వెంటనే బ్రిడ్జ్ నిర్మించింది.
రోడ్లు, వంతెనలు కూలిపోవడం వల్ల చాలా చోట్ల రెస్క్యూ ఆపరేషన్‌కి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్ సాయంతోనూ సహాయక చర్యలు కొనసాగిస్తోంది. కొన్నిచోట్ల భారీ ఎక్విప్మెంట్ తరలించేందుకు వీలు లేకుండా పోతోంది. కానీ ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో చాలా వరకూ రెస్క్యూ ఆపరేషన్‌కి లైన్ క్లియర్ అయింది.
తక్కువ టైమ్‌లోనే చాలా పటిష్ఠంగా కట్టారు. ఈ వంతెన బరువు 24 టన్నులు. జులై 31వ తేదీన సాయంత్రం ఈ నిర్మాణం మొదలు కాగా మరుసటి రోజు పూర్తైంది.
ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యాక ఆర్మీ వాహనాల రాకపోకలకు మార్గం సుగమమైంది. ఆ తరవాతి నుంచి రెస్క్యూ ఆపరేషన్ ఊపందుకుంది. వరద నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నప్పటికీ లెక్క చేయకుండా ఈ నిర్మాణం పూర్తి చేశారు సైనికులు. సోషల్ మీడియాలో రియల్ వారియర్స్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
మరి కొన్ని చోట్ల కూడా చిన్న పాటి వంతెనలు నిర్మించి బాధితులను కాపాడుతోంది ఇండియన్ ఆర్మీ. ఎన్ని సవాళ్లు ఎదురు వస్తున్నా లెక్క చేయకుండా సహాయక చర్యలు కొనసాగిస్తోంది.