Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
మరి కొన్ని చోట్ల పండు ముసలి వాళ్లూ పోలింగ్ బూత్‌కి వచ్చి ఓటు వేశారు. తమిళనాడులో దిండిగల్ నియోజకవర్గంలో 102 ఏళ్ల చిన్నమ్మ వచ్చి ఓటు వేసింది. సరిగ్గా నిలబడలేని ఆ వయసులో కూడా చేతికర్ర సాయంతో పోలింగ్ బూత్ వరకూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకుని అందరికీ స్ఫూర్తిగా నిలిచింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఉధంపూర్‌లో ఓ కొత్త జంట నేరుగా పెళ్లి మండపం నుంచి పోలింగ్ బూత్‌కి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంది. పోలింగ్ స్టేషన్ వరకూ వధూ వరులు కార్లోనే వచ్చారు. పెళ్లి దుస్తుల్లోనే క్యూలో నిలబడి ఓటు వేశారు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఇద్దరూ సూచించారు. పెళ్లి బట్టల్లో ఉన్న వాళ్లను ఓటర్లు ఆసక్తిగా చూశారు. ఇదే ఉధంపూర్‌లో మరో కొత్త జంట ఇదే విధంగా పెళ్లి బట్టలతో వచ్చి ఓటు వేసింది.
ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డు సాధించిన జ్యోతి ఆమ్గే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆమె ఓటు వేశారు. పోలింగ్ అధికారి సాయంతో ఆమె ఓటు వేశారు. ఆ తరవాత బయటకు వచ్చి వేలిపై ఉన్న ఓటింగ్ ఇంక్‌ని చూపించారు. అక్కడికి వచ్చిన వాళ్లంతా ఆమెని ఆసక్తిగా గమనించారు.
ఉధంపూర్‌లో ఓ అంధుడు తన కుటుంబంతో సహా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఓటు వేసేందుకు ఇంత దూరం వచ్చానని చెప్పాడు. ఓటు అనేది అందరి హక్కు అని, కచ్చితంగా ఓటు వేయాలని సూచించాడు. కూతురు, భార్య సాయంతో పోలింగ్ బూత్ వరకూ వచ్చి మరీ ఓటు వేశాడు.