Wayand Landslides: పాపం పసివాళ్లు, వయనాడ్ విధ్వంసంతో చిన్నారుల విలవిల - కన్నీళ్లు పెట్టిస్తున్న ఫొటోలు
వయనాడ్లో ప్రకృతి విధ్వంసం 308 మంది ప్రాణాల్ని బలి తీసుకుంది. ఇంకా వందలాది మంది గల్లంతయ్యారు. వాళ్ల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ విపత్తు వయనాడ్ ప్రజల వెన్నులో వణుకు పుట్టించింది. ఎటు చూసినా పెద్ద ఎత్తున బురద మేటలు కనిపిస్తున్నాయి. ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇండియన్ ఆర్మీతో పాటు NDRF,SDRF సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. దాదాపు నాలుగు రోజులుగా ఈ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. వెయ్యి మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించిన సిబ్బంది బాధితుల ప్రాణాల్ని కాపాడేందుకు తమ ప్రాణాల్నీ లెక్క చేయడం లేదు.
అటవీ అధికారులు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. అట్టమాలా ప్రాంతంలో పెద్ద ఎత్తున వరద నీళ్లు వచ్చి చేరుకున్నాయి. ఓ కుటుంబం ఆ వరద నీటిలో చిక్కుకుపోయింది. అటవీ అధికారులు వాళ్లని కాపాడారు. ఆ సమయంలో చిన్నారుల పరిస్థితి చూస్తే ఒళ్లు జలదరించిపోయింది.
ఈ ముగ్గురు పిల్లలు తిండి లేక ఆకలితో అలమాటించారు. అటవీ అధికారులు వాళ్లను కాపాడినప్పుడు తండ్రి కనీసం నడిచే పరిస్థితిలో కూడా లేడు. చిన్నారులు బిక్కుబిక్కుమంటూ చూస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఆషిక్ అనే అటవీ అధికారి వీళ్లను కాపాడాడు. కాల్పెట్టా రేంజ్ అటవీశాఖ బృందం కొండలకు తాళ్లు వేసుకుని దిగి మరీ ఈ కుటుంబం ఈ పసి పిల్లలను రక్షించింది. ఒక్కో అధికారి ఒక్కో పిల్లాడిని ఎత్తుకుని చాలా జాగ్రత్తగా కొండలకు తాళ్లు కట్టి పైకి తీసుకువచ్చి వాళ్ల ప్రాణాలను కాపాడారు.
ఈ ఫోటోలు, ఈ విజువల్స్ ఆ అటవీశాఖ అధికారుల సాహసం ఇప్పుడు అందరి ప్రశంసలను అందుకుంటోంది. ఇంకా ఎంతో మంది చిన్నారులు ఇలానే బిక్కుబిక్కుమంటూ తలదాచుకుని ఉంటారని, వాళ్లనీ కాపాడాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే దాదాపు 49 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా వేస్తున్నారు.
మందక్కైలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన సిబ్బంది ఓ కుటుంబాన్ని రక్షించింది. వరదలో చిక్కుకున్న ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. బైలే బ్రిడ్జ్ నిర్మించి ఈ సహాయక చర్యలు కొనసాగించారు.