Malabar- 21: మలబార్ 21 సముద్ర విన్యాసాలకు రెడీ.. గువామ్కు చేరుకున్న భారత్ నౌకలు
బంగాళాఖాతంలో నాలుగు దేశాల మధ్య జరగనున్న మలబార్ 21 నౌకాదళ సముద్ర విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత నౌకాదళాలు సిద్ధమయ్యాయి. శివాలిక్, కాడ్మాట్ అనే రెండు నౌకలు ఇప్పటికే అమెరికాలోని ద్వీప భూభాగమైన గువామ్కు చేరుకున్నాయి. శివాలిక్, కాడ్మాట్ నౌకలను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఐఎన్ఎస్ శివాలిక్కు కెప్టెన్ కపిల్ మెహతా, ఐఎన్ఎస్ కాడ్మాట్కు కమాండర్ ఆర్కే మహారాణా నాయకత్వం వహిస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ రెండు నౌకలలో పలు ఆయుధాలు, సెన్సార్లు ఉన్నాయి. ఇవి మల్టీ రోల్ హెలికాప్టర్లను తీసుకెళ్లగలవు. భారతదేశ యుద్ధనౌక నిర్మాణ సామర్ధ్యాల పెరుగుదలను సూచికలుగా ఇవి విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా దేశాలు మలబార్ 21 నౌకాదళ సముద్ర విన్యాసాల్లో పాల్గొంటాయి.
భారత్, అమెరికా మధ్య నౌకాదళ విన్యాసాలకు సంబంధించి 1992లో ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా మలబార్ సిరీస్ పేరిట సముద్ర విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం.. ఆగస్టు 26వ తేదీ నుంచి 29 వరకు మలబార్- 21 నౌకాదళ విన్యాసాలు జరుగుతాయి. సముద్ర భద్రతా కార్యకలాపాల కోసం మలబార్ నౌకాదళ విన్యాసాలు తోడ్పడతాయి.