Rahul Gandhi With Mechanic: బైక్ మెకానిక్‌గా మారిన రాహుల్ గాంధీ- ఫొటోస్ వైరల్
జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అకస్మాత్తు పర్యటనలతో సామాన్య జనాల్లో కలిసిపోతున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా రాహుల్ గాంధీ మోటార్ సైకిల్ మెకానిక్ తో ఉన్న ఫోటోలు వైరల్‌గా మారాయి.
మెకానిక్‌షాప్‌లో రాహుల్ ఉన్న ఫొటోలను కాంగ్రెస్ అధికారిక ట్విటర్ ఖాతా నుంచి షేర్ అయ్యాయి.
కర్ణాటక ఎన్నికల టైంలో డెలివరీ బాయ్ వెనుక కూర్చొని కనిపించారు. ఇప్పుడు ఢిల్లీలోని కరోల్ బాగ్ లోని బైక్ మెకానిక్ షాపులో కనిపించారు.
రాహుల్ గాంధీ ఫోటోను షేర్ చేసిన కాంగ్రెస్... 'ఈ చేతులు ఇండియాను తయారు చేస్తాయి, ఈ దుస్తులపై ఉన్న మరకలు మనకు గర్వకారణం. అలాంటి చేతులను ప్రోత్సహించే పని ఒక ప్రజా నాయకుడు మాత్రమే చేస్తాడు. 'భారత్ జోడో యాత్ర' కొనసాగుతోంది. అని రాసి ఉంది.
ఈ ఫోటోల్లో బైక్ విడిభాగాలతోపాటు, బైక్ మెకానిక్‌తో కలిసి రాహుల్ పనిచేస్తున్నట్లు చూడవచ్చు.