In Pics: ఎర్రకోటపై జెండా రెపరెపలు, ఆవిష్కరించిన ప్రధాని మోదీ - ఫోటో గ్యాలరీ
దేశం నేడు 76వ స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి నేటితో 75 ఏళ్లు పూర్తయ్యాయి.
నేడు (ఆగస్టు 15) ఉదయం 7.30 గంటలకు ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వేదిక ప్రాంగణం సహా పరిసరాలను సుందరంగా తీర్చి దిద్దారు.
స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా పటిష్ఠమైన బందోబస్తు చేశారు.
ఉదయం 7.33 గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగాన్ని ప్రారంభించారు.
అంతకంటే ముందు ప్రధాని మోదీ ఉదయం 7.06 గంటలకు రాజ్‌ఘాట్‌ను సందర్శించి జాతిపిత బాపుకు నివాళులర్పించారు.
ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉదయం 6.55 గంటలకే ప్రారంభం అయ్యాయి.
డిఫెన్స్ సెక్రటరీ, త్రివిధ దళాల చీఫ్ అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ చీఫ్ లు వచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 7.18 గంటలకు ఎర్రకోటకు చేరుకుంటారు.
ఎర్రకోటకు చేరుకున్న వెంటనే, ప్రధానమంత్రికి త్రివిధ దళాలు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తారు.
7.30 గంటలకు ఎర్రకోట వద్ద ప్రధానమంత్రి జెండాను ఎగురవేసిన అనంతరం జాతీయ గీతం ప్లే చేశారు.
వచ్చే 25 ఏళ్లు పంచ ప్రాణాలు పెట్టి అభివృద్ధి కోసం పని చేయాలని మోదీ ప్రసంగంలో పిలుపునిచ్చారు.
1. వికసిత భారతం, 2. బానిసత్వ నిర్మూలన, 3. వారసత్వం, 4. ఏకత్వం, 5. పౌర బాధ్యత ఇవే మన పంచ ప్రాణాలు అని మోదీ అన్నారు.
రాజకీయ సుస్థిరత వల్ల కలిగే ప్రయోజనాలను భారత్ ఇప్పటికే ప్రపంచానికి చాటిందని మోదీ అన్నారు.
ఎర్ర కోట వద్ద రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం
గుజరాత్ లో చిన్నారులతో మోదీ తల్లి స్వాతంత్య్ర వేడుకలు