Twin Tower Demolition Photos: 9 సెకన్లలో నోయిడా ట్విన్ టవర్స్ ఇలా కూలిపోయాయి
నోయిడాలో సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేత ఎట్టకేలకు పూర్తయింది. మధ్యాహ్నం 2.30 గంటలకు 9 సెకన్లలో ఈ భవంతులను కూల్చివేశారు. (Photo Credit: Twitter/ANI)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపరిసర ప్రాంతాల్లోని వారిని వేరే చోటకు తరలించారు. చుట్ట పక్కల ఉన్న బిల్డింగ్లు డ్యామేజ్ కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. (Photo Credit: Twitter/ANI)
ఈ రెండు టవర్స్‌ని కూల్చేందుకు మొత్తం 3,700 కిలోల బరువైన ఎక్స్‌ప్లోజివ్స్‌ను వినియోగించారు. (Photo Credit: Twitter/ANI)
ఈ టవర్స్‌లోని 7000 హోల్స్‌లో ఈ ఎక్స్‌ప్లోజివ్స్‌ను అమర్చారు. 20 వేల సర్క్యూట్లు ఏర్పాటు చేశారు. ట్రిగ్గర్ చేసినప్పుడు ఉన్నట్టుండి ఆ పిల్లర్స్ ఒక్కసారిగా కూలిపోయాయి. (Photo Credit: Twitter/ANI)
ఈ టవర్స్‌కు 8 మీటర్ల దూరంలోనే చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. వాటితో పాటు 12 మీటర్ల రేడియస్‌లో మరికొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. (Photo Credit: Twitter/ANI)
రూ.100కోట్ల ఇన్సూరెన్స్ పాలసీతో ఈ ఎక్స్ప్లోజన్ చేపట్టారు పరిసర ప్రాంతాల్లోని బిల్డింగ్‌లకు ఏమైనా డ్యామేజ్ జరిగితే ఈ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. (Photo Credit: Twitter/ANI)
ఈ డిమాలిషన్ ప్రాజెక్ట్ కోసం మొత్తం రూ.20 కోట్లు ఖర్చు కానుంది. మొత్తం నష్టం రూ.50 కోట్లు అని అంచనా. (Photo Credit: Twitter/ANI)
ముంబయికి చెందిన Edifice Engineering సంస్థ ఈ కూల్చివేతను చేపట్టనుంది. దాదాపు 9 ఏళ్ల న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొన్న తరవాత..చివరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. (Photo Credit: Twitter/ANI)
ఎమరాల్డ్ కోర్ట్ సొసైటీ ఆవరణలో ఈ టవర్స్‌ను అక్రమంగా నిర్మించారన్న కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా వీటిని కూల్చివేశారు. (Photo Credit: Twitter/ANI)
అలహాబాద్ హైకోర్ట్ 2014లోనే ఈ టవర్స్‌ను కూల్చివేయాలని తీర్పునిచ్చింది. ఆ తరవాతే ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. మొత్తానికి ఇలా కూలిపోయింది. (Photo Credit: Twitter/ANI)