In Pics: 219 మంది క్షేమంగా స్వదేశానికి, ఉక్రెయిన్ నుంచి ముంబయి చేరిన మొదటి విమానం
ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ముంబయి చేరుకుంది. ఈ విమానంలో 219 మంది స్వదేశానికి చేరుకున్నారు. ముంబయి చేరిన వారిలో ఏపీ తెలంగాణకు చెందిన వారూ ఉన్నారు. అలాగే అర్ధరాత్రి తర్వాత మరో విమానం దిల్లీ చేరుకోనుందని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎయిర్ ఇండియా విమానం క్రూ తో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
ఉక్రెయిన్ నుంచి వచ్చిన వారితో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
ఉక్రెయిన్ సంక్షోభం నుంచి బయటపడి సురక్షితంగా ముంబయి చేరుకున్న వారిలో 9 మంది ఆంధ్రకు చెందినవారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిలో కొందరి వివరాలను ఏపీ అధికారులు రిలీజ్ చేశారు. ఉక్రెయిన్ నుంచి ముంబయి చేరుకున్న ఆంధ్ర విద్యార్థులు: 1.పోతాల వెంకట లక్ష్మీధర్ రెడ్డి 2.తెన్నేటి వెంకట సుమ 3.అఫ్రాన్ అహ్మద్ 4.అమ్రితాంష్ -విశాఖపట్నం 5.వారణాసి శ్వేతా శ్రీ
వీరు కాకుండా మరో 13 మంది ఏపీ విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి ఆదివారం దిల్లీ చేరుకోనున్నారు. వారిలో కొందరి వివరాలను ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసింది. 1)రాజులపాటి అనూష 2)శిమ్మ కోహిమా వైశాలి 3)వేముల వంశీ కుమార్ 4)జయశ్రీ 5)హర్షిత 6)షేక్ ఫర్జానా కౌసర్ 7)సూర్య సాయి కిరణ్ 8)అభిషేక్ మంత్రి
ఉక్రెయిన్ లో ఏపీకి చెందివ విద్యార్థులు 350 మంది ఉన్నారని తెలిపారు దిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినవారు మొత్తం 1100 మంది ఉండగా వారిలో 700 మంది కాంటాక్ట్స్ అందుబాటులో ఉన్నారని ఆయన తెలిపారు.
ఏపీకి చెందిన 350 మందినీ స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్టు ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. వారిలో దిల్లీ చేరుకునే విద్యార్థులకు ఉచిత బస, వసతి, రవాణా సౌకర్యాన్ని ఏపీ ప్రభుత్వమే కల్పిస్తుందనీ ఎవరూ వాటి కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన 350 మందిలో 90 శాతం మంది ఒకే యూనివర్సిటీలో చదవుతూ ఉండడం వల్ల వారి వివరాలు సేకరించడం వారిని కాంటాక్ట్ చేయడం కాస్త సులభమైందన్నారు.